ఈరోజు మంగళవారం సోషల్ మీడియా మొత్తం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కనిపించబోతున్నాడు.. లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ ని LEO లో నటించేందుకు ఒప్పించాడంటూ ఓ వార్త వైరల్ గా మారింది. #RamCharan హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుంది అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతూ ఉండడంతో.. ఇప్పుడు హీరో విజయ్ LEO లో రామ్ చరణ్ నటిస్తున్నాడనే న్యూస్ బాగా పాపులర్ అయ్యింది.
అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించడం లేదు అంటూ ఆయన సన్నిహిత వర్గాల నుండి బయటికి వచ్చిన సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్, అలాగే బుచ్చి బాబు తో RC16 చిత్రాలు మాత్రమే అని, ఆయన ఏ హీరో చిత్రంలో కనిపించడం లేదు అంటున్నారు. అయితే మరో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి హ్రితిక్ సినిమా వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ అంటున్నారు. పాత్ర కూడా నిడివి తక్కువే అంటున్నారు.
మరి రామ్ చరణ్ కూడా విజయ్ చిత్రంలో నటిస్తే తప్పేమిటి అంటున్నారు మెగా ఫాన్స్. కేరెక్టర్ ఎలివేట్ అయ్యేది చిన్న రోల్ చేసినా తమిళనాట ఎక్కువగా గుర్తింపు వస్తుంది.. చరణ్ మైలేజ్ కూడా పెరుగుతుంది అని మెగా ఫాన్స్ వాదన. మరి విజయ్ LEO చిత్రంలో చరణ్ నటించినా ఓకె.. లేదన్నా ఓకె కదా!