Advertisement
Google Ads BL

లైగర్ ప్లాప్ అన్న వెంటనే విజయ్ అలా చేసాడట!


లైగర్ తో ప్యాన్ ఇండియా హిట్ కొట్టాలని ఆశపడిన దర్శకుడు పూరి, హీరో విజయ్ దేవరకొండలని ఆ చిత్రం బిగ్గెస్ట్ డిస్పాయింట్ చేసింది. లైగర్ ప్రమోషన్స్ అంటూ హీరో విజయ్, హీరోయిన్ అనన్య పాండేలు దేశం మొత్తం చుట్టేశారు. విపరీతమైన హైప్, విపరీతమైన అంచనాలు మధ్యన ఆగష్టు 25 న లైగర్ ప్యాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన అన్ని భాషల్లో సేమ్ రిజల్ట్ తో నిలబడింది ఆ తర్వాత విజయ్ దేవరకొండ అసలు లైగర్ ప్లాప్ అయ్యింది అనే విషయాన్ని మర్చిపోయి.. తదుపరి షూటింగ్ కోసం ప్రిపేర్ అవడమే కాదు తరుచూ అభిమానులకి దగ్గరగా వచ్చేసాడు.

Advertisement
CJ Advs

తాజాగా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అన్న విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ విడుదలైన రోజు.. ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాక అందరికి అర్ధమైపోయింది. ఈ సినిమా ఇక ఆడదు. ఇంకా ఈ సినిమాని మనం జనాల మీదకి రుద్దాలి అనే ఇంటెన్షన్ వదిలేసి, మనం ఫిజికల్లీ, మెంటల్లీ ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డామే అనే బాధని వదిలేసి.. ఆ రోజు సాయంత్రం అంటే ఆగష్టు 25 సాయంత్రం నుండే అన్న తదుపరి మూవీ ఖుషి కోసం రెడీ అవడం మొదలు పెట్టేసాడు.

అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. ఇప్పటివరకు అన్నపెట్టిన ఎఫర్ట్స్ మీద ఎవరు వేలు ఎత్తి చూపలేరు. అంతగా అన్నయ్యకి సినిమాలంటే ఇష్టం. అందుకే అంత కష్టపడతాడు అంటూ ఆనంద్ దేవరకొండ.. లైగర్ ప్లాప్ అవడం తర్వాత అన్న విజయ్ రియాక్షన్ గురించి లేటెస్ట్ గా బేబీ ప్రమోషన్స్ లో బయటపెట్టాడు.

Anand Deverakonda on Liger flop :

Anand Deverakonda about Liger result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs