Advertisement
Google Ads BL

ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్


టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళితే ఆయన ఫాన్స్ సపోర్ట్ చెయ్యలేదు కానీ.. ఆయన సినిమాలకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చినా ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఉన్నారు. అందులోనుండే ఆయన ఏపీలోని జగన్ ప్రభుత్వంపై ట్వీట్స్ వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఐదారు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతుండడంతో ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యే అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రెండు వారాల క్రితం ఆయన ఉభయ గోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు.

Advertisement
CJ Advs

ఇక సోషల్ మీడియా ట్విట్టర్‌లో పవన్‌కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అందులోనే ఆయన సినిమాలు, రాజకీయాలకు సంబందించిన ట్వీట్స్ వేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ఆయన ఇన్స్టా ప్రొఫైల్‌లో ఇతర అకౌంట్ల మాదిరిగానే ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind! అనే క్యాప్షన్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇలా అకౌంట్‌ ఓపెన్‌ చేసారో లేదో ఇలా రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్‌ వచ్చి చేరుతున్నారు. 

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాలోకి పవన్‌ అడుగుపెట్టారట. 

Pawan Kalyan debuts on Instagram:

Power Star Pawan Kalyan makes Instagram debut 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs