Advertisement
Google Ads BL

కిచ్చా సుదీప్ మోసం చేసాడు: కుమార్


కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచయమే. ఈగ, బాహుబలి చిత్రాలు తర్వాత కిచ్చ సుదీప్ కన్నడ చిత్రాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. అయితే తాజాగా కిచ్చా సుదీప్ పై కన్నడ ప్రొడ్యూసర్ ఒకరు సంచనలన ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. సుదీప్ పై కన్నడ ప్రొడ్యూసర్ KN కుమార్ అనే వ్యక్తి పలు ఆరోపణలు చేస్తున్నాడు. తన బ్యానర్ లో సినిమా చేస్తానని మాటిచ్చి.. తన దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకుని ఇప్పుడు సినిమా చెయ్యకుండా మోసం చేశాడంటూ కుమార్ ఆరోపిస్తున్నాడు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా కిచ్చా సుదీప్ కలైపులి థామన్ నిర్మాణంలో కిచ్చా45 చేస్తున్నాడు. దానికి సంబందించిన టీజర్ వదిలారు. అయితే ప్రొడ్యూసర్ KN కుమార్ మాత్రం తన దగ్గర 9 కోట్ల అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తానని చెప్పి.. ఇప్పుడు డేట్స్ ఇవ్వకుండా తనని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు, ఎనిమిదేళ్ల క్రితమే తాను అడ్వాన్స్ చెల్లించాను, కానీ ఇప్పటివరకు తన సినిమా కోసం డేట్స్ కేటాయించడం లేదు, ఇప్పటికే కర్ణాటక ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లుగా కుమార్ కిచ్చా సుదీప్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అంతేకాకుండా తన నిర్మాణంలో కిచ్చా సుదీప్ తో చేసే చిత్రానికి దర్శకుడు నంద కిషోర్ కి కూడా అడ్వాన్స్ ఇచ్చాము, ఆ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్ పెట్టాము. సుదీప్ కి పూర్తి రెమ్యునరేషన్ 9 కోట్లు చెల్లించాము. అంతేకాకుండా తన వంటగది రెన్నొవేషన్ కోసం మరో పది లక్షలు సుదీప్ తీసుకున్నాడంటూ కుమార్ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా తనకి డేట్స్ ఇవ్వకుండా తమిళ నిర్మాతతో సినిమాని ప్రకటించాడంటూ ఆయన సుదీప్ పై ఫైర్ అవుతున్నాడు. 

Kichcha Sudeep cheated: Producer Kumar:

Producer MN Kumar accuses Kichcha Sudeep of evading a film after taking remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs