Advertisement
Google Ads BL

ఫేమస్ టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార


స్టార్ కిడ్ గా మహేష్ బాబు కుమర్తె సితారకి బోలెడంత పాపులారిటీ ఉంది. చాలామంది స్టార్స్ తమ పిల్లలతో ప్రవేట్ లైఫ్ ని షేర్ చెయ్యడానికి ఇష్టపడరు. కానీ మహేష్ మాత్రం తన ఫ్యామిలీ వెకేషన్స్ పిక్స్ ని భార్య నమ్రత ద్వారా అభిమానులకి చేరవేస్తారు. అలాగే తన కూతురు సితారాతో పబ్లిక్ ఈవెంట్స్ కి హాజరవుతారు. మొన్నామధ్యన జీ తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మహేష్ తన కూతురు సితారతో కలిసి యాడ్ షూట్ చేసాడు. అంతకుముందే నమ్రత, కొడుకు గౌతమ్ కూతురు సితారాలతో కలిసి ఓ యాడ్ లో కనిపించిన మహేష్.. ఇప్పుడు అతను కుమార్తెతో సోలో యాడ్ షూట్ చేయించారు.

Advertisement
CJ Advs

మే నెలలో సితారని తీసుకుని ముంబై వెళ్లి అక్కడే జ్యువెలరీ యాడ్లో సితారని నటింపజేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న సితారాతో ఫేమస్ జ్యువలరీ కంపెనీ వారు కమర్షియల్ యాడ్ షూట్ చేసారు. ఇండియా ట్రెడిషనల్ వేరే లుక్స్ తో సితార ఆ యాడ్లో కనిపించింది. సితార మొట్టమొదటి కమర్షియల్ యాడ్ ఇది. మన దేశపు ట్రెడిషినల్ లుక్స్ లో చేసిన ఓ జెవెలర్ యాడ్ న్యూయార్క్ నగరం లో ఫేమస్ టైమ్స్ స్క్వేర్ పై మెరిసింది. సితార నటించిన మొదటి యాడ్ నే ఈ రేంజ్ లో లాంచ్ అవ్వడం అనేది చాలా స్పెషల్ అని చెప్పాలి. 

అక్కడ న్యూయార్క్ నగరంలో టైం స్క్వేర్ పై మెరిసిపోతున్న సితార మొదటి యాడ్ పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sitara rare achievement:

Sitara trending on New York Times Square
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs