Advertisement
Google Ads BL

మరోసారి గురూజీని టార్గెట్ చేసిన పూనమ్


గత కొన్నేళ్లుగా నటి పూనమ్ కౌర్ సినిమాలకి దూరంగా ఉంటున్నా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటుంది. ఆమె కి సినిమా అవకాశాలు తగ్గడంతో వేరే వేరే పనులతో బిజిగా మారిన పూనమ్ కౌర్ మాత్రం సోషల్ మీడియాలో ఇండస్ట్రీలోని ప్రముఖులని టార్గెట్ చేస్తుంది. ఆమె టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లనే అయినా.. ఇండైరెక్ట్ గా పూనమ్ సోషల్ మీడియాలో వాళ్లతో ఫైట్ చేస్తూ ఉంటుంది. త్రివిక్రమ్ ని గురువు అంటూ సంభోదిస్తూ ఆయనపై సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. తాజాగా త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా అనౌన్సమెంట్ రోజున పూనమ్ కౌర్ మరోసారి గురువుగారిని టార్గెట్ చేసింది.

Advertisement
CJ Advs

పూనమ్ కౌర్ గురు పౌర్ణమి సందర్భంగా ఇన్స్టా స్టోరీస్ లో ఇలా రాసుకొచ్చింది. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. టామ్, డిక్ అండ్ హారి అని ప్రతి ఒక్కరిని గురువు అని సంభోదించవద్దు. నీతులు చెబుతూ స్టేజ్ మీద.. జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు మీకు గురువు అవుతారు. గురువు అంటే మీకు శ్వాస కావొచ్చు, హృదయ స్పందన కావొచ్చు, మీకు విముక్తికావొచ్చు అంటూ పూనమ్ చేసిన ట్వీట్ త్రివిక్రమ్ గురించే అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

స్టేజ్ పై మాట్లాడి నీతులు చెప్పేది, లైఫ్ లతో చెలగాటమాడేది త్రివిక్రమ్ అని పూనమ్ కౌర్ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు కూడా గురువు గారిని పూనమ్ అలా టార్గెట్ చేసి ఉంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. 

Did Poonam Kaur target Trivikram Srinivas aka Guruvu:

Poonam Kaur Tweet on Guru Purnima
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs