సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దుల్కర్ సల్మాన్ ఎప్పుడూ తన సినిమాల విషయంలోనే, లేదంటే ఫ్యామిలీ వెకేషన్స్ నో, ఇంకా అభిమానులని సర్ ప్రైజ్ చేస్తూ అప్పుడప్పుడు కార్ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. తన లేటెస్ట్ చిత్రం కింగ్ అఫ్ కొత టీజర్ రిలీజ్ చేసిన దుల్కర్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు దుల్కర్ కి ఏమైంది అంటూ అందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. దుల్కర్ సల్మాన్ సండే నైట్ ఓ పోస్ట్ పెట్టాడు.
కొద్దిసేపు నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇలాంటి దానిని ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నా, నా మనసు నుండి దానిని తీసెయ్యలేకపోతున్నాను, దాని గురించి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను, కానీ దాని గురించి చెప్పొచ్చో లేదో అని నాకు తెలియదు.. అంటూ చేసిన ట్వీట్ చూసిన అభిమానులు ఏమైంది దుల్కర్, అసలు ఎందుకు మీకీ ఆందోళన అంటూ అడుగుతున్నారు. ఇలా నిమిషాల్లో వైరల్ అయిన ట్వీట్ కింద దుల్కర్ ఫాన్స్ వేలాదిగా చేసిన కామెంట్స్ తో దుల్కర్ హడావిడిగా ఆ పోస్ట్ తొలగించాడు.
అయితే అప్పటికే వైరల్ అయిన ఆ పోస్టు తో దుల్కర్ ఫాన్స్ ఇంకా ఆందోళన చెందుతున్నారు. అసలు దుల్కర్ ఏం చూసాడు, ఏ చెప్పాలనుకున్నాడు అంటూ వాళ్ళు తెగ ఆలోచించేస్తున్నారు.