ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తర్వాత హీరో రామ్ రెండు డిజాస్టర్స్ తో డిస్పాయింట్ అయ్యాడు. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి రామ్ తో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సబ్జెట్ తో మూవీ మొదలు పెటేసారు. రామ్ బర్త్ డే రోజున రామ్ ఊర మాస్ లుక్ తో పాటుగా పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ ని వదిలి ఈ #BoyapatiRapo ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేశారు. సెప్టెంబర్ 15 న రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసి రామ్ అభిమానుల్లో మరింత హుషారుని క్రియెట్ చేసారు.
నేడు గురు పొర్ణమి సందర్భంగా #BoyapatiRapo టైటిల్ ని గ్లిమ్ప్స్ తో సహా రివీల్ చేసారు. స్కంద గా రామ్ విశ్వరూపాన్ని మరోసారి పరిచయం చేసారు బోయపాటి. నీటిలో నుండి దేవత విగ్రహాలను తీస్తున్న షాట్ తో గ్లిమ్ప్స్ మొదలై.. విలన్స్ ని రామ్ నీటిలో చితక బాదుతూ.. మీరు దిగితే ఊరెదుండదు..నేను దిగితే మిగిలేదుండదు అంటూ రామ్ ని పవర్ ఫుల్ గా చూపిస్తూనే అంతే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు. వైట్ పంచెలో రామ్ విలన్స్ తో చేసిన వాటర్ ఫైట్ అదిరిపోయింది.
ఇక బ్యాగ్రౌండ్ లో స్కంద సాంగ్ పూనకాలు తెప్పించేసింది. ప్యాన్ ఇండియా లోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటుగా మరోసారి గ్లిమ్ప్స్ అండ్ టైటిల్ తో మేకర్స్ కన్ ఫామ్ చేసారు.