మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ కొన్నాళ్లుగా శ్రీజకి దూరంగానే ఉంటున్నాడు. వీరి మధ్యన విడాకులు అయ్యాయా లేదా అనేది క్లారిటీ లేకపోయినా శ్రీజ-కళ్యాణ్ దేవ్ లు విడిపోయారనేది మాత్రం పక్కానే. కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ నుండి బయటికొచ్చాకా ఒంటరిగా గడుపుతున్నాడు.. సినిమాలకి దూరంగానే ఉంటున్నాడు. శ్రీజ ని వివాహం చేసుకున్నాక రెండు మూడు సినిమాలు చేసిన కళ్యాణ్ దేవ్ శ్రీజ తో విడిపోయాక సినిమాల పేరు ఎత్తడమే లేదు. సైలెంట్ గా ఉంటూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రకారకాల పోస్ట్ లతో అందరి అనుమానాలను మరింతగా పెంచుతున్నాడు.
రీసెంట్ గా కూతురు నివిష్క తో టైమ్ స్పెండ్ చేస్తూ ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కళ్యాణ్ దేవ్.. వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే అంటూ తాను వారానికి ఒకసారి కూతురితో నాలుగు గంటలు మాత్రమే స్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పేసాడు. తాజాగా కళ్యాణ్ దేవ్ మన జీవితంలో మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం చేసినప్పుడే మనకు అత్యంత మధుర క్షణాలు.. దీనితో మీరు ఏకీభవిస్తారా అంటూ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
మరి కళ్యాణ్ దేవ్ పోస్ట్ లకి ఫుల్ క్లారిటీ లేకపోయినా.. ఇలా అనుమానాలకు తావిచ్చేలా మాట్లాడడం చూస్తే శ్రీజ తో కళ్యాణ్ దేవ్ తెగతెంపులు చేసుకున్నాడనేది నిజము అనే అనిపిస్తుంది. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ లతో నెటిజెన్స్ అయితే ఓ కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు.