Advertisement
Google Ads BL

ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజీ అప్ డేట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి గబ్బర్ సింగ్ కంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందించడానికి పని చేస్తున్నారు. డెడ్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇతర తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో డాషింగ్ గా కనిపిస్తుండగా, ఇతర స్టిల్స్‌లో తన స్వాగ్ తో ఆకట్టుకున్నారు. హరీష్ శంకర్, పవర్ స్టార్‌తో సన్నివేశాలను చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఇద్దరి మధ్య పెరిగిన బంధాన్ని ఈ పోస్టర్లన్నీ చూపిస్తున్నాయి. మరో సారి పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడం హరీష్‌కి మరో పెద్ద అవకాశం, ఈ విజయవంతమైన కాంబినేషన్‌లో సినిమా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్,  టెంపర్ వంశీ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు

ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. అయనంక బోస్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాల స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరస్తున్నారు.  

Ustaad Bhagat Singh update :

Ustaad Bhagat Singh Second Schedule Begins Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs