Advertisement
Google Ads BL

నిఖిల్ తీసుకున్న నిక్కచ్చి నిర్ణయం


కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన కుర్ర హీరో నిఖిల్.. ఆ చిత్రంతో తన మార్కెట్ ని పెంచుకోవడమే కాదు ఆడియన్స్ లో బలమైన్ ముద్ర వేసాడు. కార్తికేయ సీరీస్ తో మంచి హిట్స్ అందుకున్న నిఖిల్.. స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే స్పై చిత్రం షూటింగ్ సమయంలో నిర్మాతతో నిఖిల్ గొడవ పడడం వలనే ఆ సినిమా రిలీజ్ విషయంలో చాలా ప్రోబ్లెంస్ ఎదురయ్యాయనే టాక్ నడిచింది. అందుకే సోలోగానే నిఖిల్ హీరోయిన్ తో కలసి ప్రమోషన్స్ చేసాడు కానీ.. ఆ సినిమా రిజల్ట్ ని పట్టించుకోలేదు అంటారు. 

Advertisement
CJ Advs

కార్తికేయ 2 సక్సెస్ వలనే స్పై కి నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికి నిఖిల్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. అది నిఖిల్ కి ఉన్న డిమాండ్. అయితే స్పై రిజల్ట్ తర్వాత నిఖిల్ ఇప్పుడికొక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదేమిటంటే నిఖిల్ కొన్నాళ్ల పాటు కొత్త  నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు డేట్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడని సోషల్ మీడియా టాక్. స్పై విషయంలో డిస్పాయింట్ అయిన నిఖిల్ ఇకపై కథల ఎంపికలో నిర్మాత దర్శకుల విషయంలో కూడా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని డెసిషన్ తీసుకున్నాడు. ఇదే విషయాన్ని సినీజోష్ సహా తనకి ఆప్తులైన ఇతర మీడియా మిత్రులతో పంచుకుంటున్నాడు.

నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 3 అనౌన్స్ చేసినా అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. కారణం చందు మొండేటి నాగ చైతన్య తో కమిట్ అయ్యాడు. ఆ చిత్రం పూర్తయ్యాకే నిఖిల్ తో కార్తికేయ 3 చేసే అవకాశం ఉంది. ఈ లోపులో నిఖిల్ ఏ దర్శకుడితో పని చేస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Why did Nikhil take such a decision!:

Actor Nikhil take such a shocking decision!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs