Advertisement
Google Ads BL

అది పవన్ ఫాన్స్ పని కాదంటగా..


పవన్ కళ్యాణ్ తొలిప్రేమని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మరీ మంచి ప్రమోషన్స్ తో రీ రిలీజ్ చేసారు. సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న తొలిప్రేమ రిలీజ్ లో పవన్ ఫాన్స్ అని చెప్పుకునే కొంతమంది భీబత్సం చేసారు. తొలిప్రేమ రీ రిలీజ్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తారు అనుకుంటే.. ఇప్పుడు పవన్ ఫాన్స్ చేసిన ఓ పని వారిని విమర్శించేలా చేసింది. అయితే అది పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన పని కాదని.. కావాలనే వీరి పేరుని చెడగొట్టడానికి ఎవరో చేసారంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. విజయవాడ కపర్థి సినిమా ధియేటర్లో తొలిప్రేమ సెకండ్ షో సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో బీభత్సం చేసారు.

Advertisement
CJ Advs

అక్కడ తెరని చింపేసి, సీట్స్ విరగొట్టడమే కాకుండా.. అద్దాలని పగలగొట్టి కపర్ణి థియేటర్ ని డ్యామేజ్ చేసేసారు. అయితే పవన్ ఫాన్స్ అంటూ ధియేటర్ ధ్వంసానికి కుట్రతోనే కొంతమంది పనిగట్టుకుని వచ్చారంటూ.. అక్కడి థియేటర్ సిబ్బంది చెప్పడం గమనార్హం. సినిమా మధ్యలో పదిమంది అకస్మాత్తుగా లేచి  గొడవ చేస్తూ.. స్క్రీన్ పైకి ఎక్కి మరీ స్క్రీన్ కోసేశారు, సీట్ల పైకి ఎక్కి ఇష్టం అవిచ్ఛిఅంట్లు చేస్తూ వాటిని ధ్వంశం చేసారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి కొట్టారు.

సీసీ కెమెరాలు, బయట అద్దాలు కూడా ధ్వంసం చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇలా ఎందుకు చేస్తారు. వారు తమ అభిమాన హీరో సినిమా చూడకుండా ఇలాంటి విధ్వంసానికి వారు దిగరు. ఇదంతా పవన్ పేరుని డ్యామేజ్ చెయ్యడానికి కుట్రతో వేరెవరో చేసిన పని అంటూ చెబుతున్నారు. ప్రసుతమైతే పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో కావాలనే ఇలా చేశారా లేక, నిజంగా అభిమానులు ఇలా చేసుకుంటారా.. లేక రాజకీయ కారణాలతో చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pawan Kalyan Fans Damage Theatre :

Pawan Kalyan Fans Damage Vijayawada Kaparni Theatre 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs