Advertisement
Google Ads BL

నిహారిక భర్త చైతన్య ఏదో చెబుతున్నాడు


మెగా ఫ్యామిలీలోకి అల్లుడిగా అంగరంగ వైభవంగా అడుగుపెట్టిన చైతన్య జొన్నలగడ్డ.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఏ అకేషన్‌లోనూ కనిపించడం లేదు. నిహారికతో పెద్దల సమక్షంలో ఏడడుగులు వేసిన చైతన్య జొన్నలగడ్డ మెగా ఫ్యామిలీలో బాగానే కలిసిపోయినా.. నిహారికతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారని, ఇద్దరూ కలిసి విడాకుల కోసం అప్లై చేశారంటూ, ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారంటూ గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కాకుండా.. ప్రతి ఈవెంట్‌లో నిహారిక సింగిల్‌గానే కనబడుతుంది. ఫ్రెండ్స్‌తోనే గోవాలో ఎంజాయ్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఇన్ని రోజులుగా అంటే దాదాపు పది నెలలుగా కామ్‌గా ఉన్న చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో కూడా కనిపించడమే లేదు. నిహారికతో ఉన్న పిక్స్‌ని డిలీట్ చేసిన చైతన్య జొన్నలగడ్డ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటో షేర్ చేస్తూ.. ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కొందిమంది జీవితంలో జరుగుతుంది. 

అలా నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు నుంచి విపస్సనా యోగను చేయడం వల్ల నా లైఫ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా, కాస్త ఉల్లాసంగా ఉంటోంది. ఒకరి జీవితంలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.. అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. అయితే నిహారికతో విడిపోయి ఆ బాధలో ఉన్న చైతన్య ఇలా యోగ చేసి ఆ బాధనుండి బయటపడి ఉంటాడు.. అందుకే ఇలా పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజెన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

Chaitanya Jonnalagadda Insta Post Goes Viral:

Chaitanya Jonnalagadda Gives Clue on His Relation with Niharika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs