రామ్ చరణ్ ప్రస్తుతం కూతురు క్లింకార తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఉపాసన డెలివరీ దగ్గర నుండి ఆయన భార్యతో కలిసి ఉన్నాడు. ఇక ఇప్పుడు శంకర్ తో చెయ్యాల్సిన గేమ్ ఛేంజర్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. అయితే మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. కానీ దిల్ రాజు అవేమి పట్టించుకోకుండా కొడుకు బర్త్ డే వేడుకల్లో మునిగిపోయాడు. శంకర్-దిల్ రాజు ఇద్దరూ ఎప్పుడు గేమ్ ఛేంజర్ డేట్ ఇస్తారో అంటూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ ని వదిలేసి.. కనీసం బుచ్చి బాబుతో చేయాల్సిన మూవీ అయినా మొదలు పెట్టమంటూ చరణ్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క దర్శకుడు బుచ్చి బాబు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ముందుగా అధికారికంగా సినిమాను లాంచ్ చేయాలి అని బుచ్చిబాబు ఈ విషయమై రామ్ చరణ్ తో లు జరుపిన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. RC16 ను ఆగస్టులో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
ఇదే ఏడాది డిసెంబర్లో లేదా 2024 జనవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తుంటే.. మెగా ఫాన్స్ మాత్రం శంకర్ ఎలా అయితే ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ బ్యాలెన్స్ చేస్తున్నారో మీరు అలాగే గేమ్ ఛేంజర్ - బుచ్చిబాబు మూవీస్ ని బ్యాలెన్స్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి చరణ్ ఫాన్స్ రిక్వెస్ట్ ని ఎంతవరకు స్వీకరిస్తాడో చూడాలి.