Advertisement
Google Ads BL

సామజవరగమన బుకింగ్స్ అదిరిపోతున్నాయిగా..


పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన సామజవరగమన కి అనుకున్నంతగా ఓపెనింగ్స్ రాలేదు. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు నుండే స్పెషల్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడం మాత్రమే కాదు ఆ ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో సామజవరగమన ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని భావించినా.. రెస్పాన్స్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోయింది. అయితే మౌత్ టాక్ సూపర్బ్ గా ఉండడంతో సామజవరగమన మెల్లగా పుంజుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ శ్రీవిష్ణు సామజవరగమనకి కనెక్ట్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

ఇది చెప్పడానికి ప్రత్యేకమైన కారణం.. బూమ్ మై షో లో సామజవరగమన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. శనివారం, ఆదివారం సామజవరగమన బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ వీకెండ్ లోనే ఇది బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. తర్వాత లాభాల బాట పట్టడం గ్యారెంటీగా ఉంది. ఏజెంట్ తో డల్ అయిన AK ఎంటర్టైన్మెంట్ కి సామజవరగమన హిట్ కాస్త ఊరటనిచ్చింది అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం సామజవరగమన అటు ఓవర్సీస్ లోనూ దూసుకుపోతుంది.

అక్కడ కూడా రోజు రోజుకి మంచి ఫిగర్స్ నమోదు చేస్తుంది. మొదటిరోజు సామజవరగమన ఓపెనింగ్స్ డల్ అవడానికి కారణం నిఖిల్ స్పై పై ఉన్న అంచనాలే. కార్తికేయ 2 హిట్ అవడంతో అందరి చూపు స్పై పై పడింది. దానికి ఓపెనింగ్స్ అదిరిపోగా.. మంచి టాక్ ఉన్న సామజవరగమన ఓపెనింగ్స్ పరంగా డల్ అయ్యింది. కానీ ఈ వీకెండ్ సామజవరగమనదే.

Samajavaragamana bookings are getting crowded..:

Samajavaragamana is hitting theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs