Advertisement
Google Ads BL

బాలయ్య ఇంటికి ఆర్పీ చేపల పులుసు


నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు అంటూ కిర్రాక్ ఆర్పీ ఎంతెలా ఫేమస్ అయ్యాడో అందరం చూసాం. కూకట్ పల్లిలో ముందుగా చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆర్సీని యూట్యూబ్ చానల్స్ బాగా పాపులర్ చేసాయి. నేనంటే మీడియాకి చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చే ఆర్పీ చేపల పులుసు విషయంలో చాలా త్వరగా పాపులర్ అవ్వడానికి యూట్యూబ్ ఛానల్స్ కి ఎదురు డబ్బులిచ్చాడనే టాక్ ఉంది. అయితే ఆర్పీ కూకట్ పల్లి తర్వాత మాదాపూర్, ఎస్ ఆర్ నగర్ లలో తన బ్రాంచెస్ ని ఓపెన్ చేసాడు. సెలబ్రిటీస్ కి ముఖ్యంగా జబర్దస్త్ గ్యాంగ్ ని పిలిచి చేపల పులుసుని గ్రాండ్ గా ప్రారంభిస్తున్న ఆర్పీ ఫ్రాంచైజీస్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు.

Advertisement
CJ Advs

ఇప్పటికే అనంతపూర్ లో రెండు, వైజాగ్ లో, ఇంకా బెంగుళూర్ లో ఇప్పుడు మియాపూర్ క్రాస్ రోడ్స్ లోను ఆర్పీ తన చేపల పులుసు బ్రాండ్ ని స్ప్రెడ్ చేసాడు. అయితే అది ఓన్ గా చెయ్యకుండా వేరే వాళ్ళకి తన చేపల పులుసు పేరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరు మీద డబ్బు తీసుకుని ఫ్రాంచైజీస్ ఇస్తున్నాడు. తాజాగా మియాపూర్ క్రాస్ రోడ్స్ లో మొదలు పెట్టిన చేపల పులుసు బలగం వేణు, ఇంకా హీరో అశ్విన్ లు ఈ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ ఓపెనింగ్ లోనే ఆర్పీ తన చేపలపులుసు బాలకృష్ణ ఇంటికి కూడా వెళ్ళింది అని చెప్పాడు. 

గతంలో మెగాస్టార్, ప్రభాస్ ఇలా చాలామంది హీరోలకి తనకు చేపల పులుసు పంపించానని చెప్పిన ఆర్పీ తాజాగా బాలయ్య ఇంటికి చేపల పులుసు ఎలా వెళ్లిందో చెప్పాడు. మాదాపూర్ బ్రాంచ్ కి బాలకృష్ణ ఇంటి నుండి కొంతమంది వచ్చి చేపల పులుసు అడిగారని.. అప్పటివరకు తనకి తెలియదని.. అప్పుడే వాళ్ళు బాలకృష్ణగారి మనుషులు అని తెలిసింది. నా చేపల పులుసు బావుంటేనే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళకి నచ్చితేనే కదా వాళ్ళు నా చేపల పులుసు ప్రత్యేకంగా పట్టుకెళ్ళేది అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

RP Chepala Pulusu for Balakrishna house:

Kiraak RP launches Nellore Pedda Reddy Chepala Pulusu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs