Advertisement
Google Ads BL

అనవసరంగా స్వాతి రెడ్డిని కెలికారేమో


సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైసీపీ బాగోతాలను బట్టబయలు చేస్తూ టీడీపీ సపోర్టర్ గా ఉన్న స్వాతి రెడ్డిని YCP నేతలు గట్టిగా టార్గెట్ చేసారు. సోషల్ మీడియాలో శ్వేతా చౌదరి అనే అమ్మాయి స్వాతి రెడ్డిగా పేరు మార్చుకుని వైసీపీ ని వైసీపీ మహిళలను నీచంగా మార్ఫింగ్ చేసిన ఫొటోస్ షేర్ చెయ్యడమే కాకుండా.. వల్గారిటీ కూడిన పోస్టులతో ఇబ్బంది పెడుతుంది అంటూ నానా గోల చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆమె రెడ్డి కాదు చౌదరి అంటూ నిరూపించడానికి సకలప్రయత్నాలు చేస్తూ వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ తో ఆమెపై అసభ్యకరమైన పోస్ట్ లతో టార్గెట్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనవరసంగా ఆమె స్వాతి రెడ్డి కాదు, శ్వేతా చౌదరి అంటూ టార్గెట్ చేసి తప్పు చేసారని ఫీలయ్యేలా స్వాతి రెడ్డి రెచ్చిపోయి YCP ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఎండకడుతుంది. గతంలో రోజుకో పోస్ట్ లేదంటే రెండు రోజులకో పోస్ట్ వేసే స్వాతి చౌదరి ఇప్పుడు గంటకో పోస్ట్ వేస్తూ వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది. ఆమెని బ్రోతల్ అంటూ అనకూడని మాటలతో వైసీపీ వాళ్ళు టార్గెట్ చెయ్యడంతో.. ఆమె మరింతగా రెచ్చిపోయి వైసీపీకి వ్యతిరేఖంగా చంద్రబాబుకి అనుకూలంగా పోస్టులు పెడుతుంది.

స్వాతి రెడ్డి పోస్టులలో మెయిన్ హైలైట్స్.

మీరు జనాల మీద పడని ఒక్క ఏరియా చెప్పండి రా..

లక్ష కోట్లు .. మహా మేత కాపాడాయ రా..

ప్రజల మీద పడి తినకండిరా …

చట్టాన్ని చేతుల్లో తీసుకొంటున్నారు జనం.

కీచక ప్రదేశ్ లో బాధితులే భీములు🙏

2014-19 మద్యకాలంలో... 

అది సిటీ ఆఫ్ డెస్టినేషన్ !

సిఐఐ సమ్మిట్ లు, ఐటి & ఫిన్ టెక్ సంస్థలు !

బీచ్ ఫెస్టివల్స్ & బెలూన్ ఫెస్టివల్స్ !

మిలీనియం టవర్స్, సన్ రైజ్ టవర్స్, ఫిన్ టెక్ టవర్స్ !

ఐ.ఐ.ఎం, ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా, రెడ్డీస్ ల్యాబ్స్ !

ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ !

ఎన్నో ఎన్నెన్నో !! 

అభివృద్ధి జాడేదీ..

చిన్నప్పుడు రామకోటి పుస్తకాలు రాసిన రోజులు గుర్తు వస్తున్నాయి 

ఈ కింద కేసు లు అన్ని జగన్ జగన్ జగన్ అని వున్నాయి సుప్రీంకోర్టు లో …

ఈ రోజు 27 కేసులు ఉంటే 20 మా అన్నావే 😂😂

గంటకి 11 కోట్లు అప్పు చేస్తున్నాడు .

అయితే ఏంటి అనుకుంటున్నారు ఏమో

మీ మీద రోజుకీ 50/- అప్పు పెరుగుతుంది

మీ కుటుంబం లో నలుగురు వుంటే .. రోజుకీ 200 అప్పు పెరుగుతుంది.

అంటూ మీమ్స్ ని తీసుకొచ్చి పోస్ట్ చేస్తూ వాటికీ రిలేటెడ్ గా ట్వీట్స్ చేస్తూ జగన్ గుండెల్లో నిద్రపోతుంది. మరి ఆమెని కూడా YCP నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా బాగానే టార్గెట్ చేస్తున్నారులెండి.

YCP targets Swathi reddy:

Swathi Reddy targets YCP government
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs