Advertisement
Google Ads BL

అక్కడ పబ్లిక్ రివ్యూస్ బ్యాన్ ..!


ఏదైనా సినిమా రిలీజ్ అవ్వగానే నగరం నడిబొడ్డున ఉన్న ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు యూట్యూబ్ ఛానల్స్ పొలోమంటూ వాలిపోతాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. సినిమా చూసొచ్చిన ప్రేక్షకుడి నుండి ఆ సినిమా ఎలా ఉందొ అంటూ పబ్లిక్ టాక్ తీసుకోవడం యూట్యూబ్ ఛానల్స్ కి అలవాటుగా మారిపోయింది. మరి యూట్యూబ్ ఛానల్స్ చేసే హడావిడికి కొంతమంది సినిమా చూసాక రివ్యూస్ అంటూ తమ ఒపీనియన్ షేర్ చెయ్యడం మొదలు పెట్టారు. పబ్లిక్ రివ్యూస్ ఇస్తూ చాలామంది ఫేమస్ అయ్యారు.

Advertisement
CJ Advs

కొంతమంది హీరోలకి అనుకూలంగా, కొంతమంది జన్యున్ రివ్యూ అంటూ చాలా హంగామా చేసేవారు. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ప్రేక్షకుల కంటే యూట్యూబ్ ఛానల్స్ వారే ఏక్కువగా కనిపిస్తున్నారు. సినిమా చూసి బయట కాలుపెడితే చాలు.. సినిమా ఎలా ఉంది అంటూ గుమ్మిగూడిపోతున్నారు. అయితే తాజాగా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఈ పబ్లిక్ రివ్యూస్ ని బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎలాంటి పబ్లిక్ రివ్యూస్ ఇవ్వకుండా యాజమాన్యం.. ఈ రివ్యూస్ పై బాన్ విధించింది. మల్టిప్లెక్స్ ఆవరణలో ఇలాంటి యాక్టివిటీస్‌పై నిషేధం విధిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.

అయితే దీనికి కారణాలు లేకపోలేదు.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుదలైంది. ఇదే రోజున ఒక యూట్యూబర్‌పై ప్రభాస్ అభిమానులు దాడి చేశారు. ఏ సినిమా అయినా కూడా విడుదలైన మొదటి రోజున తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో చెప్పే వ్యక్తి ఎప్పటిలాగే ఆదిపురుష్ పైనా తన ఒపీనియన్స్ పంచుకున్నాడు. కానీ అతను ఆదిపురుష్ గురించి నెగెటివ్‌గా చెప్పడం జీర్ణించుకోలేని ప్రభాస్ ఫ్యాన్స్.. అతన్ని  చితకబాదారు. అయితే ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకూడదనే ఉద్దేశ్యంతోనే మల్టిప్లెక్స్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Public Reviews Ban at Prasads:

Public Talks Ban @ Prasads Create A New Headache!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs