Advertisement
Google Ads BL

బెస్ట్ ఓపెనింగ్స్ విత్ బ్యాడ్ టాక్ !


కార్తికేయ 2 తో ఫ్యాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్.. ప్యాన్ ఇండియా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసాడు. నార్త్ లో కార్తికేయ 2 ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో నిఖిల్ నుండి వస్తున్న స్పై పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. స్పై మూవీ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఎన్నో రిలీజ్ డేట్స్ ని తప్పించుకుంటూ ఫైనల్ గా నిన్న జూన్ 29 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. కానీ అయితే స్పై పై ఆడియన్స్ ఉన్న అంచనాలను నిఖిల్ నిలబెట్టుకోలేకపోయాడు. 

Advertisement
CJ Advs

స్పై విడుదలైన అన్ని భాషల్లోనూ పూర్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ టాక్, పబ్లిక్ టాక్ అలాగే క్రిటిక్స్ నుండి పూర్ రివ్యూస్ రావడంతో స్పై మొదటి రోజే తేలిపోయింది. అయితే కార్తికేయ 2 సక్సెస్ తర్వాత నిఖిల్ నుండి వచ్చే సినిమాపై ఆటోమాటిక్ గా అంచనాలు ఏర్పడినట్లుగానే.. స్పై పై అంచనాలు పెరగడం అలాగే బక్రీద్ హాలిడే కలిసి రావడంతో స్పై మొదటిరోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. నిఖిల్ స్పై కి మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 11.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

మరి పూర్ టాక్ తో ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం నిఖిల్ కెరీర్ లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇదంతా కార్తికేయ 2 మహిమే. కానీ స్పై లో విషయం లేకపోవడంతో టాక్ తేలిపోయింది. మరి రెండో రోజు కలెక్షన్స్  ఎలా ఉంటాయో చూడాలి. 

Poor Talk Best Openings:

Nikhil Spy movie 1st day collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs