సోషల్ మీడియాలో పుట్టకముందు నుండే ట్రెండ్ అవుతూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని రెట్టింపు చేసిన మెగా వారసురాలు, మెగా ప్రిన్సెస్ పుట్టి పదిరోజులవుతున్నా ఇప్పటికి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ పేరు ట్రెండ్ అవడం ఏ స్టార్ వారసులకు జరగలేదేమో. రామ్ చరణ్-ఉపాసన తల్లితండ్రులవడం ఓ ఆనందమైతే, మెగా వారసురాలుగా మెగా ప్రిన్సెస్ వారి ఇంట్లో అడుగుపెట్టడం మరింత సంతోషాన్ని కలిగించింది. మెగాస్టార్ అయితే లక్ష్మి దేవి మా మనవరాలు, మహార్జాతకురాలు అంటూ పొంగిపోతున్నారు.
ఈరోజు జూన్ 30 ఉపాసన-చరణ్ కుమర్తెకి పేరు పెట్టబోతున్నారు. నేమింగ్ సెర్మోని తో పాటుగా.. పాపకి బారసాల అదేనండి ఉయ్యాల ఫంక్షన్ నిర్వహించబోతున్నట్టుగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మెగా ఫ్యామిలిలో జరుగుతున్న ఈ వేడుకకి ఇప్పుడు ఎవరెవరు గెస్ట్ లుగా వస్తారో తెలియదు కాని.. ముంబై నుండి బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ-ఆయన భార్య నీతూ అంబానీలు ఉపసన పాప కోసం బంగారు ఉయ్యాల గిఫ్ట్ గా పంపించినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖేష్ అంబానీ మెగాస్టార్ మనవరాలి కోసం బంగారు ఉయ్యాల గిఫ్ట్ గా పంపారని, దాని కోసం కోటికి పైగా ఖర్చు అయ్యింది అంటూ ఆ న్యూస్ సారాంశం. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.
రామ్ చరణ్-ఉపాసన పాపకి ఈ వేడుకలోనే పేరుకూడా పెట్టబోతున్నారు. ఉపాసన పాప బారసాల ఫంక్షన్ కి జరుగుతున్న ఏర్పాట్లని ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.