Advertisement
Google Ads BL

శ్రీలీల వదులుకుంటే రష్మిక చేసిందట..


ప్రస్తుతం టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా రష్మిక క్రేజీ పాన్ ఇండియా మూవీలతో పాటుగా పలు భాషల్లో నటించేస్తూ అదరగొట్టేస్తుంది. రష్మికని తెలుగులోకి నాగశౌర్య ఛలో సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు. కన్నడలో కిర్రిక్ పార్టీతో సక్సెస్ అందుకున్న రష్మిక మందన్నకి నాగశౌర్య తన ఓన్ బేనర్‌లో తెరకెక్కించిన ఛలో మూవీలో ఛాన్స్ ఇచ్చి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇప్పించాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ని దున్నేస్తూ క్షణం తీరిక లేకుండా.. స్టార్ హీరోలు, కుర్ర హీరోలు తేడా లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న శ్రీలీల.. నాగశౌర్య ఆఫర్‌ని వదులుకోవడంతోనే రష్మికకి ఆ ఆఫర్ దక్కి ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుందట.

Advertisement
CJ Advs

 

నాగశౌర్య రంగబలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాము ఛలో సినిమా కోసం ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలనే అనుకున్నాము. కానీ అప్పుడు ఎందుకో శ్రీలీల మా సినిమాలో నటించడం కుదరలేదు. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి రష్మికని తీసుకున్నారంటూ చెప్పడంతో.. అయ్యో శ్రీలీల ఛలోతోనే ఎంట్రీ ఇస్తే.. ఈపాటికి స్టార్ హీరోయిన్ అయ్యేది అని ఆమె అభిమానులు ఒక పక్క ఫీలవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.. ఆమె ఇప్పుడు కూడా క్రేజీ హీరోయిన్నే. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలోనే.. ఆమె ఎనిమిది ప్రాజెక్ట్స్ చేస్తుంది. దీనిని చూస్తే శ్రీలీల కెరీర్ ఎలా ఉందో అంచనా వేయవచ్చు అంటున్నారు.

 

కానీ కొంతమంది ఛలో తోనే శ్రీలీల ఎంట్రీ ఇస్తే.. అప్పట్లోనే టాప్ హీరోయిన్స్‌గా మారిన రష్మికకి, పూజా హెగ్డేకి చెక్ పెట్టేది.. ఇప్పటికీ మించిపోలేదు.. పూజా హెగ్డేకి, రష్మికకి శ్రీలీల చేతిలో ఇత్తడే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Rashmika Mandanna Turns Star with Sreeleela Missed Film:

Hero Naga Shaurya Reveals Interesting News About Sreeleela 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs