Advertisement
Google Ads BL

సెలబ్రిటీస్‌కి దిల్ రాజు కళ్ళు చెదిరే పార్టీ


టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. అందుకే వరస సక్సెస్‌లు ఆయన తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో తికమకపడుతున్నాడు. శంకర్‌తో సినిమా చేస్తున్న దిల్ రాజు.. ఈ విషయంలో ఏమీ చేయలేక కామ్‌గా ఉన్నాడు. అయితే ఇపుడు దిల్ రాజు టాలీవుడ్ ప్రముఖుల కోసం అదిరిపోయే పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అంటే గత ఏడాది ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అవడంతో ప్రముఖుల కోసం పార్టీ ఇచ్చిన దిల్ రాజు.. తేజస్వినీని రెండో వివాహం చేసుకున్నాక స్టార్ హీరోలకి, ప్రముఖులతో తన 50వ పుట్టిన రోజు పార్టీని ఓ రేంజ్‌లో చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

 

ఇప్పుడు కూడా దిల్ రాజు తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకులని టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో నిర్వహించే ఆలోచనలో ఉన్నాడట. కరోనా సమయంలో పెళ్లిని సైలెంట్‌గా చేసుకున్న దిల్ రాజు... కొడుకు పుట్టాకే పార్టీ ఇస్తారని అనుకున్నప్పటికీ.. దిల్ రాజు కామ్‌గానే కనిపించినా ఇప్పుడు మాత్రం తన కొడుకు ఫస్ట్ బర్త్ డే వేడుకలని గ్రాండ్‌గా చేయాలని చూస్తున్నాడట. 

ఈ పార్టీకి కూడా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ లాంటి స్టార్స్ వచ్చి సందడి చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరి ఈ వేడుకల కోసం దిల్ రాజు ఎలాంటి విందు ప్లాన్ చేస్తున్నాడో.. అంటూ అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి.

Dil Raju Plans Grand Party to Celebrities:

Dil Raju Will Celebrates His son Birthday Party Grandly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs