Advertisement
Google Ads BL

ఈసారి చిరుని యాక్సెప్ట్ చేసిందా?


మెగాస్టార్ చిరుతో కలిసి స్టాలిన్ మూవీలో హీరోయిన్ గా నటించిన త్రిష.. అప్పట్లో మెగాస్టార్ కన్నా చిన్నగా ఉంది.. ఆయన పక్కన తేలిపోయింది. త్రిష అస్సలు చిరు కి మ్యాచ్ కాలేదనే విమర్శలు ఎదుర్కొంది. ఇక తర్వాత త్రిష కొరటాల శివ-చిరు కలయికలో తెరకెక్కిన ఆచార్య మూవీలో హీరోయిన్ గా సెట్స్ లోకి వచ్చిన కొద్దిరోజులకే ఆచార్య నుండి బయటికెళ్ళిపోయింది. అప్పట్లో తన కేరెక్టర్ నిడివి నచ్చని కారణంగానే త్రిష ఆచార్య నుండి తప్పుకుంది అన్నారు. మళ్ళీ కాజల్ ని తీసుకొచ్చి.. షూట్ చేసి తర్వాత కాజల్ సీన్స్ మొత్తం కట్ చేసి పడేసారు. అప్పుడు త్రిష ఆచార్య విషయంలో చేసిందే కరెక్ట్ అన్నారు.

Advertisement
CJ Advs

ఇక ఇన్నాళ్ళకి మళ్ళీ త్రిష మెగాస్టార్ చిరు తో కలిసి నటించబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. భోళా శనకర్ తర్వాత మెగాస్టార్ చిరు.. కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. బంగార్రాజు సినిమా తర్వాత ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే అవకాశం కళ్యాణ్ కృష్ణ కొట్టేసాడనే మాట వినిపిస్తుంది. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాకు రీమేక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడని కూడా అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో చిరుకి జోడిగా త్రిష కనిపించబోతుందట. చిరుకి భార్యగా సిద్ధుకి తల్లిగా త్రిష కేరెక్టర్ ఉండనుంది అని సమాచారం. అందులో నిజమెంతుంతో తెలియదు కానీ.. ఈ సినిమాని ఆగస్టు 23న చిరంజీవి బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఈ చిత్రంలో చిరు తో కలిసి నటించడానికి త్రిష ఒప్పుకుందా.. అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆచార్య నుండి వెళ్ళిపోయిన త్రిష మళ్ళీ చిరుతో నటిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే 17 ఏళ్ళ తర్వాత చిరు-త్రిష జోడీని మళ్ళీ ప్రేక్షకులు వీక్షిస్తారు.

After 17 Years, Chiranjeevi Doing Romance with Trisha:

Trisha to romance Chiranjeevi once again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs