కార్తికేయ 2 తో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారిన హీరో నిఖిల్.. ఆ చిత్రంతో బాలీవుడ్ లో బంపర్ కలెక్షన్స్ సాధించాడు. కార్తికేయ 2 ప్యాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ అవడంతో ఆయన తదుపరి మూవీని కూడా అదే స్టయిల్లో అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల కోసమే చేసాడు. ఎడిటర్ గ్యారీ బి. హెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ నిఖిల్ హీరోగా తెరకెక్కించిన సినిమా స్పై. స్పై నేడు ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఢిల్లీ నుండి గల్లీ దాక.. ముంబై నుండి హైదరాబాద్ వరకు మీడియా ఇంటర్వూస్, అలాగే ప్రమోషన్స్ తో హడావిడి చేసిన స్పై లో రానా దగ్గుబాటి పేరు గెస్ట్ రోల్ లో వినిపించడం ఇలా అన్నీ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. స్పై ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. మరి సినిమా చూసిన పేక్షకులు ఆగుతారా.. సినిమా ఎలా ఉందో తమ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.
స్పై చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ ఎలా ఉంది అంటే.. స్పై మూవీ ప్రశంసనీయ చిత్రం. ఫస్ట్ హాఫ్ ఓకె ఓకె. స్పై సినిమా ఫస్టాఫ్ అంతా ఓ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ను కనిపెట్టే మిషన్ తో సాగుతుంది. ఇలాంటి జోనర్ లో మనం ఊహించేటువంటి సీట్ ఎడ్డ్ సన్నివేశాలు ఏం లేవు. ఇక ఈ సినిమా రిజల్ట్ అంతా సెకండాఫ్ పైనే ఆధారపడి ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు. నిఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడు. మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్ సినిమాల్లా ఉంది. నిఖిల్ నటన అద్భుతం. అతని కెరీర్ కి స్పై ప్లస్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు.
స్పై మూవీ బాగుంది. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమా. మెయిన్లీ మెసేజ్ ఒరియెంటెడ్. పల్లెటూరి విధానం బాగుంది. రాజకీయం బాగుంది. దాంతో ఎలా మోసపోతారో చూపించారు.. అని కొందరు ట్వీట్ చెయ్యగా.. దాదాపు అన్ని ఊహించే సీన్లతో సెకండాఫ్ చివరికి వచ్చింది. ట్విస్ట్ లు ఇచ్చే సన్నివేశాలు తక్కువ. అక్కడక్కడ బాగుంది. నేతాజీ కథను బాగా నేరేట్ చేయలేదు. దర్శకుడు సాదాసీదాగా సినిమాని తెరకెక్కించారు. ఇప్పటివరకు అయితే స్పై చూడాలని చెప్పే సినిమాలా అనిపించలేదు. ఇతర సినిమాల్లాగే రెగ్యులర్ స్పై, కాప్ డ్రామాలాగే ఉంది.. సెకండ్ ఎలా ఉంటుందో.. దాని రిజల్ట్ ఏమిటో చూద్దామంటూ కొంతమంది స్పందిస్తున్నారు.
ఫైనల్ గా నిఖిల్ స్పై చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది. మరి ఈ చిత్రం ప్యాన్ ఇండియా ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుందో చూడాలి.