Advertisement
Google Ads BL

పవన్ పెళ్లిళ్లు తప్ప ఇంకేం లేవా జగన్


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ రెడ్డి ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మూడు పెళ్ళిళ్ళని తప్ప ఆయనని విమర్శించేందుకు మరో అస్త్రం దొరకడం లేదనుకుంటూ.. అందుకే పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిపై గురించి మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర చేపట్టారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని, వైసిపీ ప్రభుత్వంలోని తప్పులని ఎత్తి చూపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడ టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఇద్దరూ కలిసి గెలిచేస్తారేమో అని ప్యాకేజి స్టార్ అంటూ పవన్ మైండ్ ని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వైసీపీ నేతలు.

Advertisement
CJ Advs

తాజాగా జగన్ మోహన్ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అనబోయి నాలుగు పెళ్లిళ్ల గురించి, పవన్ పేరు తియ్యకుండానే విమర్శించాడు. దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్‌ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దత్తపుత్రుడిలా మనం బూతులు తిట్టలేం.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్ అంటూ జగన్ మళ్ళి పవన్ పెళ్లిళ్లపై పడడం చూసిన పవన్ ఫాన్స్.. అయ్యో పవన్ ని విమర్శించేందుకు ఏ ఆధారం దొరక్క ఆయన పెళ్లిళ్లపై ఎన్నిసార్లు పడతావ్ అంటూ జగన్ ని చూసి నవ్వుకుంటున్నారు.

ఇక జగన్ పనిలో పనిగా టీడీపీ ని కూడా కలిపి పవన్ తో పాటుగా విమర్శించేశాడు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే నిజాలని తట్టుకోలేకే పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తూ పవన్ ని కించపరిచేలా జగన్ ప్రవర్తిస్తున్నారంటూ జనసైనికులు మండిపడుతున్నారు. జగన్ నీకు పవన్ ని విమర్శించడానికి ఏమి కనబడక ఇలా పెళ్లిళ్లు మేటర్ ఎత్తుతున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.

CM Jagan indirect comments on Pawan Kalyan marriages:

YS Jagan Satirical Comments on Pawan Kalyan Marriages
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs