Advertisement
Google Ads BL

రేవంత్ రెడ్డి సినిమానే హిట్..


తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే చిన్నపిల్లలకి కూడా నవ్వొస్తుంది. ఇక్కడ బలమైన నాయకులు ఉన్నపటికీ ప్రతి ఒక్కరిలో అధికార దాహమే. అందరూ పార్టీ అధ్యక్షులు అవ్వాలని, గెలిస్తే సీఎం అవ్వాలనే కనిపిస్తారు తప్ప ఏకతాటిపై ఉండి కాంగ్రస్ కి గెలుపు ని కట్టబెడదామని అనుకోరు. సీనియర్ నాయకులైతే ప్రతిదానికి తమ పార్టీ వారినే విమర్శిస్తూ.. విమర్శలపాలవుతారు. టీడీపీ నుండి వచ్చిన పవర్ ఫుల్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం, ఆయన ఆలోచనలు, తెలివి చూసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయనకి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ లోని సీనియర్స్ కి అది నచ్చలేదు. 

Advertisement
CJ Advs

కొందరు నాయకులు కూడా రేవంత్ కి సపోర్ట్ చెయ్యరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కనబడతారు. రేవంత్ నాయకత్వం కింద పని చెయ్యడం ఇష్టం లేకో.. అధికార దాహమో కానీ.. ప్రతి ఒక్కరూ సింగిల్ ఎజెండాతోనే పని చేస్తారు. జగ్గారెడ్డి, హనుమంతరావు, భట్టి విక్రమార్క, మధు యాష్కీ ఇలా ఎవరికి వారే కనిపిస్తారు. ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఒకవైపు, భట్టి పాద యాత్ర మరోవైపు, అసలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరో కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదులు చేసి రేవంత్ కు సినిమా చూపిద్దాం అని సీనియర్ నాయకులు కూర్చున్నారు. కానీ రాహుల్ మాత్రం ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటూ రేవంత్ నాయకత్వం కింద పని చెయ్యాల్సిందే అని తేల్చి చెప్పేసారు.

చేసేది లేక రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కి ఉత్తమ్, రేణుక చౌదరి, వీహెచ్ లాంటి వాళ్లు కామ్ గా హాజరయ్యారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చక్రం తిప్పి ముందే రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టి ఎవ్వరూ మాట్లాడకుండా చేసేసారు అనేది కాంగ్రెస్ యూత్ లీడర్స్ వాదన. రాహుల్ చెప్పకపోతే రేవంత్ రెడ్డితో పాటు రేణుక, ఉత్తమ్, వీహెచ్ ఇలా మీటింగ్ లో పాల్గొన్న వాళ్లంతా వచ్చే ఎన్నికల గురించి చర్చించి ప్రెస్ మీట్ పెట్టి కూల్ గా కానిచ్చేవారు కాదు. లేదంటే రేవంత్ రెడ్డిపై రాహుల్ కి బహిరంగంగానే ఫిర్యాదు చేసి మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవారు. 

రేవంత్ రెడ్డి కూడా ముందు అధిష్టానానికి చెప్పాకే మీడియాతో మట్లాడాలంటూ రాహుల్ ద్వారా కాంగ్రెస్ సీనియర్స్ కి సంకేతాలు పంపించారనే వారూ లేకపోలేదు. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, బీజేపీ వాళ్ళు, బీఆరెస్ వాళ్ళు ఒక్కోక్కరిగా కాంగ్రెస్ లోకి చేరడంతో.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్ తో అన్ని చక్కబెడుతున్నారు. నిన్నటి వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్స్ వేసుకున్న ప్లాన్ ప్లాప్ అవ్వగా.. రేవంత్ రెడ్డి ప్లాన్ నే హిట్ అయ్యేలా కాంగ్రెస్ మీటింగ్ సక్సెస్ అవడం చూసిన నెటిజెన్స్ రేవంత్ రెడ్డి సినిమానే హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Revanth Reddy congress meeting hit:

Rahul Gandhi strong warning to telangana congress seniors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs