ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరిగే డ్రగ్స్ కలకలం మరోసారి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కబాలి నిర్మాత KP చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో సెలబ్రిటీస్ లోని కొంతమంది పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. KP కౌదరి ఎవరి పేర్లు రివీల్ చెయ్యకపోయినా.. అతని ఫోన్ లోని కీలక డేటాని పోలీసులు బయటపెట్టడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు పేర్లు, కొంతమంది బిజినెస్ మ్యాన్ ల పేర్లు బయటికి రాగా.. అందులో నటి జ్యోతి, అషు రెడ్డి, సురేఖ వాణి లాంటి వాళ్ళు ఈ కేసుతో తమకి సంబంధం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.
అషు రెడ్డితో KP కౌదరి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా ప్రచారం జరగడంతో ఆశు రెడ్డి వెంటనే రియాక్ట్ అవుతూ ఈ కేసుతో తనకి సంబంధం లేదని చెప్పింది. ఆ తర్వాత నటి జ్యోతి స్పందిస్తూ KP కౌదరి హైద్రాబాద్ వచ్చినప్పుడు తన కొడుకుని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేవాడు. మా అబ్బాయి, చౌదరి కొడుకు కలిసి ఆడుకునేవారు. మా మధ్యన ఫ్రెండ్ షిప్ మత్రమే ఉంది. ఎలాంటి డ్రగ్స్ డీలింగ్స్ లేవు అంది. ఇక సురేఖ వాణి మాపై వస్తున్న ఆరోపణలు నిజం కాదు, మమ్మల్ని మానసికంగా వేధించకండి అని చెప్పింది. అయితే KP చౌదరి వాట్సాప్ ని పోలీస్ అధికారులు రిట్రీవ్ చేసినట్లుగా తెలుస్తుంది.
చౌదరి విచారణలో భాగంగా అతని ఫోన్ తనిఖీ చెయ్యగా కీలక ఆధారాలు బయటపడినాయని అందులో భాగంగానే 14 మంది సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఒకవేళ 14 మందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మరోసారి సినిమా ఇండస్ట్రీ పరువు గంగలో కలిసినట్లే అంటున్నారు కొందరు. ఇప్పటికే ఒకసారి ఈ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని అవమానాల పాలు చేసింది. ఇప్పుడు ఇది మరోసారి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.