దర్శకుడు హరీష్ శంకర్ డిస్పాయింట్ మోడ్ లో ఉన్నాడా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తుంది. కారణమేముంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అర్ధం కాక హరీష్ శంకర్ డిస్పాయింట్ అవుతున్నాడంటున్నారు. పవన్ కళ్యాణ్ తో మూవీ ఎనౌన్స్ చేసాక చాలా రోజులకి గాని ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఈలోపులో భవదీయుడు భగత్ సింగ్ కాస్తా.. ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యింది. ఎలాగో పవన్ కళ్యాణ్ తో షూటింగ్ మొదలు పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకెళ్ళాడు. సరే వరస షెడ్యూల్స్ జరిగిపోతాయనుకుంటే మధ్యలో సముద్రఖని బ్రో, సుజిత్ OG వచ్చి చేరాయి.
సరే ఆ రెండు సినిమాలతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చేద్దామని హరీష్ అనుకున్నాడు. పవన్ మాత్రం బ్రో కి OG కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. బ్రో షూటింగ్ చక చకా కంప్లీట్ చేసేసారు. సుజిత్ తో OG కూడా అంతే స్పీడులో కంప్లీట్ చేస్తున్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుండి హరీష్ శంకర్ కి తలనెప్పి. అవన్నీ పోగొట్టాలి, సినిమాపై ఊపు తేవాలని కొద్దిపాటి షూటింగ్ పూర్తయిన ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ ఇచ్చేసి కూల్ చేసేసాడు. ఉస్తాద్ తదుపరి షెడ్యూల్ మే రెండో వారం నుండి స్టార్ట్ అవుతున్నట్టుగా హరీష్ శంకర్ అప్డేట్ ఇచ్చాడు. కానీ పవన్ ఆ షెడ్యూల్ కి వెళ్ళలేదు. మళ్ళీ OG కి డేట్స్ ఇచ్చారు.
ప్రస్తుతం OG ఫుల్ స్వింగ్ లో 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. వచ్చాక OG కే మళ్ళీ ప్రిఫరెన్స్ అంటారేమో తెలియదు. అటు హరీష్ శంకర్ పవన్ నే నమ్ముకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనెట్టి పెద్ద హీరోతో సినిమా చెయ్యలేడు. ప్రభాస్ తో సినిమా అంటున్నారు. అది ఓకె చేయించుకోవడమే కానీ.. మొదలు పెట్టలేడు. మరి పవన్ ఎప్పుడు వస్తారో.. ఉస్తాద్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక హరీష్ డిస్పాయింట్ అవుతుతున్నాడేమో అంటున్నారు.