ప్రస్తుతం శ్రీలీల బిజీ తారగా.. లక్కీకి కేరాఫ్ గా మారింది. వరస సినిమాలు ఆమెని ఊపిరి సలపనివ్వడం లేదు. ప్రస్తుతం శ్రీలీల 16 గంటలు పని చేస్తుందేమో అనేలా ఆమె డైరీ చూస్తే తెలుస్తుంది. చిన్న హీరోలైతే శ్రీలీల కోసం వెయిట్ చేసేలా ఉంది పరిస్థితి. ముందుగా దసరాకి విడుదలయ్యే సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉంది శ్రీలీల. అందుకే వైష్ణవ తేజ్ లాంటి హీరోలు ఆమె కోసం వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ తేదీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక్కో రోజుl రెండు సినిమాల షూటింగ్స్ ని చుట్టేస్తోంది. గతంలో పూజ హెగ్డే ఇలానే నాలుగు సినిమాల షూటింగ్స్ కోసం డే అండ్ నైట్ పని చేస్తూ ఉదయం ఓ షిఫ్ట్, మధ్యాన్నం మరొకటి, సాయంత్రం ఇంకోటి, రాత్రికి ఒకటి అన్న రేంజ్ లో పని చేసింది. కానీ ఇక్కడ శ్రీలీల ఎనిమిది ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చెయ్యాలి. అసలు శ్రీలీల ఇప్పుడు ఎనిమిది షిఫ్ట్ లు చెయ్యాలి. అది సాధ్యమయ్యే పని కాదు.. అందుకే కొంతమంది హీరోలు శ్రీలీల డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు మహేష్ అటు బాలయ్య అబ్బో వరసగా పరుగులే పాపకి.
అసలు ఉన్న ఎనిమిది ప్రాజెక్ట్ చాలవన్నట్టు శ్రీలీల ఇప్పుడు రవితేజ సినిమా కూడా ఒప్పేసుకుంది అనే టాక్ మొదలైంది. చిన్న గ్యాప్ కూడా వదలకుండా, మార్ హీరోయిన్ దూరకుండా.. శ్రీలీల టాలీవుడ్ మొత్తాన్ని ఆక్యుపై చేసింది అసలు శ్రీలీల బిజీ చూసిన వారంతా వావ్ శ్రీలీల ఇది కదా బిజీ అంటే అంటూ మాట్లాడుతున్నారు. నిజమే కదా.. ఎటు చూసినా శ్రీలీల పేరే వినిపిస్తుంది.