Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ K మొదటిరోజు 500 కోట్లు తెస్తుంది


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K పై ఇప్పుడు అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. బడా మల్టీస్టారర్ మాదిరి కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ లోకి అమితాబ్ తర్వాత లోకనాయకుడు కమల్ ఎంటర్ అవడంతో ఉండాల్సియాన్ అంచనాలు రెట్టింపు కాగా.. ఈ ప్రాజెక్ట్ రూపు రేఖలు మారిపోయాయి. రీసెంట్ గానే కమల్ హాసన్ రాకని కన్ ఫామ్ చేస్తూ మేకర్స్ వీడియో వదిలారు. కమల్ హాసన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్రభాస్-కమల్ మధ్యన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఊహించుకుంటూ ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. కమల్ తో ప్రభాస్, ప్రభాస్ తో కమల్ కలిసి వర్క్ చేస్తునందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ప్రాజెక్ట్ K ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12 న రిలీజ్ అవుతుంది. 2024 సంక్రాంతి కి ప్రాజెక్ట్ K ని విడుదల చేస్తామని ఈ ఏడాది మహా శివరాత్రి రోజునే మేకర్స్ ప్రకటించారు. 

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కానీ.. ఆరు నెలల పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ముఖ్యంగా వీఎఫెక్స్ వర్క్ కోసం కేటాయిస్తామని అశ్వినీదత్ ఎప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ మారబోతుంది అంటూ ఓ హింట్ ఇచ్చారు. ఆయన ఈమధ్యన ప్రాజెక్ట్ K సెట్స్ కి వెళ్లారట. ఆ సినిమా స్కేల్, కాస్టింగ్ చూస్తుంటే వరల్డ్ టాప్ గ్రోస్ర్స్ లో హాలీవుడ్ ఫిలిమ్స్ తో పాటు ప్రాజెక్ట్ K కూడా ఉంటుంది అనిపిస్తుంది. 

నా అంచనా ప్రకారం ప్రాజెక్ట్ K డే 1 కి 500  కోట్లు వస్తాయి అనుకుంటున్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్  ప్రకారం 2024 సమ్మర్ కి ప్రాజెక్ట్ K రిలీజ్ అవుతుంది అంటూ జనవరి నుండి ప్రాజెక్ట్ K పోస్ట్ పోన్ అయ్యి సమ్మర్ కి వెళ్లచ్చనే ఊహాగానాలకు తెర లేపారు తమ్మారెడ్డి. మరి నిజం గానే ప్రాజెక్ట్ K డేట్ మారే ఛాన్స్ ఉందా.. అని ప్రభాస్ ఫాన్స్ అయోమయంలోకి వెళుతున్నారు.

Is the Project K release date going to change?:

Project K first day collection is Rs.500 crore: TammaReddy Bharadwaj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs