సలార్ పోస్ట్ పోన్ అవ్వబోతుందా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ చక్కర్లు కడుతోంది. 100 రోజుల సలార్ పండుగ అంటూ ఈమధ్యనే మేకర్స్ పోస్టర్ వేసి పబ్లిసిటీ చేసారు. సెప్టెంబర్ 28 న ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ పై ఇప్పుడు ఈరకమైన వార్తలు ప్రభాస్ ఫాన్స్ ని డిస్పాయింట్ అయ్యేలా చేస్తున్నాయి. అసలే ఆదిపురుష్ రిజల్ట్ తో నిరాశలో ఉన్న ఫాన్స్ కి ఇప్పుడు సలార్ అనుకున్న తేదికి రాదేమో అనే దిగులు మొదలయ్యింది.
కారణం ఏమిలేదు.. సలార్ లో విలన్ కేరెక్టర్ చేస్తున్న మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ తన సినిమా షూటింగ్ లో గాయాలపాలై కాలికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమవడంతో .. ఇప్పుడు సలార్ కీ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సలార్ రిలీజ్ కూడా ఆగిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. పృథ్వీ రాజ్-ప్రభాస్ లపై యాక్షన్ ఘట్టాలు ఎప్పుడో ఫినిష్ చేశారు ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నా ప్రాబ్లెమ్ లేదు అంటున్నారు.
మేకర్స్ సలార్ పోస్ట్ పోన్ అవ్వడం లేదు.. అని కనీసం టీజర్ అప్ డేట్ అయినా ఇస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మనసు కుదుటపడుతుంది. లేదంటే ఇలాంటి రూమర్స్ కి అడ్డుకట్ట వెయ్యడం కష్టమైపోతుంది. ఇప్పటికే టీజర్ కట్ అయ్యింది.. టీజర్ కి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయంటూ ఓ న్యూస్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సలార్ టీజర్ ఇస్తే ఓకె.. లేదంటే హోంబులే ఫిలిమ్స్ పై ప్రభాస్ ఫాన్స్ కన్నెర్ర జేస్తారు.