పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ పక్కనబెట్టి ఏపీ రాజకీయాల్లో భాగంగా ప్రజా సమస్యల తెలుసుకునేందుకు వారాహి యాత్ర చేపట్టారు. వారం రోజులుగా ఉదయం నుండి జనసేన నేతలతో, ప్రజలతో మమేకం అవుతున్న పవన్ కళ్యాణ్ సాయంత్రానికి వారహితో రోడ్డెక్కుతున్నారు. వారాహి బస్సు యాత్రలో పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ తో వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు.
అయితే వరసగా బస్సు యాత్ర, నేతలతో మీటింగ్ లు పెడుతున్న పవన్ కళ్యాణ్ అలసిపోవడంతో ఆయనకు జ్వరం వచ్చింది అని తెలుస్తుంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా ఓ మీటింగ్ లో చెప్పారు. రాత్రి నుంచి జ్వరం ఉన్నా కానీ.. మీ ప్రేమ జ్వరాన్ని లెక్క చేయకుండా చేసింది.. మిమ్మల్ని కలవాలని జ్వరాన్ని సైతం లెక్కచెయ్యకుండా వచ్చాను అంటూ పవన్ చెప్పడంతో ఆయనకి ఏమైందో ఏమో, ఇప్పుడు ఎలా ఉన్నారో అంటూ పవన్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.
అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ భీమవరం నియోజక వర్గంలో వారాహి యాత్ర చేపట్టాల్సి ఉంది. అక్కడ భీమవరం పట్టణంలో ఆయన బహిరంగ సభ పెట్టబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ జ్వరంతోనే యాత్ర చేస్తారా.. లేదంటే అనేది తెలియాల్సి ఉండగా.. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి కనిపిస్తుంది.