నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఆమె టాప్ హీరోయిన్ పొజిషన్ ని మాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయింది. తెలుగు, తమిళంలోనే కాదు.. హిందీ లోను నటించిన ప్రియమణి తర్వాత బుల్లితెరపై డాన్స్ షోస్ కి జెడ్జ్ గా కనిపించింది. అయితే కొన్నాళ్ళుగా స్పెషల్ కేరెక్టర్స్ కే పరిమితమైన ప్రియమణి ముస్తఫా అనే ముస్లిం మతానికి చెందిన బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. కొద్దిరోజులుగా ప్రియమణి భర్త ముస్తఫాతో విడిపోయింది అనే ప్రచారం జరుగుతుంది.
తాజాగా ప్రియమణి తాను వేరే మతస్తుడిని వివాహం చేసుకున్నప్పుడు చాలామంది చాలారకాలుగా నన్ను ట్రోల్ చేసారు. నెటిజెన్స్ వారికిష్టమొచ్చినట్టుగా నోరు పారేసుకున్నారు. అయితే తాను వేరే మతస్తుడిని ఎందుకు వివాహం చేసుకుందో.. అలాగే తనపై వచ్చే ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా శరీర రంగు విషయంలో ఇప్పటికీ నాపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే, ముస్తఫాను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నా.
నేను-ముస్తఫా ఎంగేజ్మెంట్ చేసుకుని మా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసినప్పుడు నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు.. అని చాలామంది తిట్టారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. నేను ఎవరితో లైఫ్ ని షేర్ చేసుకోవాలో అనేది పూర్తిగా నా ఇష్టం అంటూ తేల్చేస్తూ ట్రోల్స్ ని పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.