మెగా మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కాంబోలో తెరకెక్కిన బ్రో మూవీ ఇంకా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. #BroTheAvatar అంటూ పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించబోతున్న ఈ చిత్రంలో పవన్ మోడ్రెన్ దేవుడి లుక్ అదిరిపోగా.. సాయి ధరమ్ తేజ్ లుక్ కూడా మెగా ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసింది. ఆ తర్వాత బ్రో ద్వయం పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలిసి వచ్చిన పోస్టర్ మరింతగా ఆకట్టుకుంది. ఇక జూన్ 29 న బ్రో టీజర్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేకర్స్ పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కాంబో లుక్ వదులుతూ టీజర్ సూన్ అని ప్రకటించారు.
మరి బ్రో ద అవతార్ టీజర్ అప్డేట్ పోస్టర్ లో మామ అల్లుళ్ళు మాసివ్ లుక్ తో చంపేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఆయన సినిమా తమ్ముడు లుక్ తో బ్రో పోస్టర్ లో కనిపించి ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేసారు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యణ్ ఓ సాంగ్ లో వేసిన లుక్ ని బ్రో లో కూడా వేశారు. తలకి ఎర్ర తుండు కట్టి.. లుంగీ పైకి కట్టి, గళ్ళ చొక్కా వేసి నోటిలో బీడీతో వయ్యారి భామ నీ హంస నడక సాంగ్ లో వేసిన లుక్ అన్నమాట. అదే సేమ్ టు సేమ్ దించేశారు. గళ్ళ చొక్కా, లుంగీ పైకి కట్టి, నోటిలో బీడీ, మెడలో ఎర్ర తువ్వాలు కట్టి అచ్చం కూలీగా మారిపోయారు పవన్ కళ్యాణ్.
సాయి ధరమ్ తేజ్ కూడా మామకు తగ్గ మాసివ్ స్టయిల్ లోనే లోనే కనిపించాడు. ఆయన ప్యాంట్ పై లుంగీ పైకి కట్టి మెడలో తుండు వేసి మాస్ గా కనిపించాడు. మెగా మామ అల్లుళ్ళ మాసివ్ లుక్ సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అయ్యింది.