తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ లతో సక్సెస్ ఫుల్ మూవీస్ చేసి.. తమిళనాట గజినీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆసిన్ ఆ తరువాత హిందీలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ ఆసిన్ అనుకున్న సక్సెస్ హిందీలో దక్కలేదు. తర్వాత 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. పెళ్లి తర్వాత ఆసిన్ మీడియాలో పెద్దగా ఫోకస్ అవ్వలేదు. అడపాదడపా బాలీవుడ్ ఈవెంట్స్ లో కనిపించేది అంతే. అసిన్ భర్త రాహుల్ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓగా పనిచేశారు. అప్పట్లో ఆసిన్, రాహుల్ పెళ్లి జరగడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారణమనే మాట బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
కొన్నేళ్లపాటు ఈ జంట తమ హ్యాపీ లైఫ్ లో సంతోషంగానే ఉన్నప్పటికీ.. గత కొంత కాలంగా మాత్రం వారి మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరికీ అస్సలు పొసగడం లేదని.. అందుకే విడిపోతేనే బెటర్ అనే నిర్ణయానికి ఆసిన్-రాహుల్ ఇద్దరూ వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే భర్త రాహుల్ తో ఆసిన్ విడిపోవాలనుకోడానికి కారణం రాహుల్ శర్మ కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడపడమేనట. రాహుల్ ఎఫ్ఫైర్ తెలిసాక ఆసిన్.. ఒకటి రెండు సార్లు హెచ్చరించిందట.
కానీ రాహుల్ ఆసిన్ హెచ్చరికలు పెడ చెవిన పెట్టి తనకు నచ్చినట్టు చేస్తుండటంతో.. ఆసిన్ అతని నుండి సెపరేట్ అయ్యి దూరంగా ఉంటుంనట్టుగా తెలుస్తోంది. ఆసిన్-రాహుల్ జంట కి ఓ పాప కూడా అంది. అయినప్పటికీ ఆసిన్ రాహుల్ తో కలిసి ఉండేది లేదు అని విడాకులకు అప్లై చెయ్యాలనుకుంటుందట.