Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసు అంటూ క్షోభ పెడుతున్నారు: అషు రెడ్డి


రెండు రోజుల క్రితం నిర్మాత KP చౌదరి డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీస్ పేర్లు మీడియాలో హల్చల్ చేసాయి. KP చౌదరి పోలీస్ విచారణలో భాగంగా ఆయన పలువురితో ఫోన్ సంభాషణలు, కొంతమందితో చాటింగ్స్, మరికొంతమందికి డ్రగ్స్ అమ్మినట్లుగా పోలీసులు గుర్తించగా, అందులో ప్రముఖంగా ఐటెం సాంగ్ హీరోయిన్, అలాగే బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేర్లు వినిపించాయి. అంతేకాకుండా KP చౌదరితో క్లోజ్ గా ఉన్న సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీతా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సురేఖ వాణి, అషురెడ్డిలు వెంటనే తమకి ఈ కేసుతో సంబంధం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Advertisement
CJ Advs

ఈ రకమయిన రూమర్లు వలన తమ కెరీర్ తో పాటుగా తమ ఫామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయంటూ వేడుకున్నారు. అషురెడ్డి ఫోన్ నెంబర్ ని కొన్ని ఛానల్స్ రివీల్ చేసేశాయి. దానితో అషురెడ్డి మరోసారి ఓ వీడియో ద్వారా తనని క్షోభ పెట్టొద్దు, ఇలాంటి న్యూస్ ల వలన నిద్ర కూడా పట్టకుండా ఏడిపిస్తున్నారు అంటూ తన గోడు వెళ్లబోసుకుంది. నేను ఇప్పటికే ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని చెప్పాను. కానీ నేను KP చౌదరితో వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర కూడా కాల్ డేటా ఉంది. మీడియాలో వస్తున్న వార్తల వలన రెండు రోజులుగా మెంటల్ టార్చెర్ అనుభవిస్తున్నాను. 

ఈ కేసులో నాకు సంబంధం లేదు అయినా.. కొంతమంది ఇష్టం వచినట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. కొన్ని ఛానల్స్ నా పర్సనల్ ఫోన్ నెంబర్ డిశ్ ప్లే చేయడంతో.. నాకు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి. చేసేది లేక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. రెండు నెలలుగా నేను హైదరాబాద్ లో లేను, షూటింగ్స్ పని మీద విదేశాల్లో ఉన్నాను. దయచేసి మా కెరీర్ పాడు చెయ్యకండి.. మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వండి అంటూ ఆ వీడియోలో అషు రెడ్డి వేడుకుంది.

Ashu Reddy is causing trouble by calling it a drug case:

Ashu Reddy is causing trouble by calling it a drug case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs