Advertisement
Google Ads BL

గుంటూరు కారంలో ఆ సీన్స్ రీ షూట్


ఎన్నో అనుమానాలు, ఎన్నో రూమర్స్ మధ్యన రెండు రోజుల క్రితమే గుంటూరు కారం కొత్త షెడ్యూల్ లోకి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాలు పెట్టారు. ప్రస్తుతం గుంటూరు కారం ఫ్రెష్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో వేసిన హీరో ఇంటి సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొంటున్నారట. అయితే పూజా హెగ్డే ప్లేస్ లోకి శ్రీలీల రావడంతో ఇప్పుడు దానికి సంబందించిన కొత్త సన్నివేశాలు చిత్రీకరణతో పాటుగా.. శ్రీలీల ప్లేస్ లోకి వచ్చిన మీనాక్షి చౌదరిపై సన్నివేశాలని చిత్రీకరణ చేపడతారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల తో తీసిన సన్నివేశాలు పక్కనపెట్టేసి.. ఇప్పుడు వాటిని రీ షూట్ చేస్తూ శ్రీలీల ప్లేస్ లో మీనాక్షిని పెట్టి చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ గుంటూరు కారం సెకండ్ హాఫ్ లో ఓ క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నడుస్తాయని.. ఈ మొత్తం ఫైట్ సన్నివేశాలు గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో సాగుతాయని తెలుస్తోంది.

గుంటూరు కారం ని ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వదులుతారో లేదంటే.. ఇక్కడ తెలుగురాష్ట్రాలకే పరిమితం చేస్తారా అనేది మేకర్స్ ఇంకా ఆలోచించలేదని తెలుస్తుంది. గుంటూరు కారం షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నాటికి పూర్తి చెయ్యాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. 

That scene was re-shot in Guntur Karam:

Meenakshi Chaudhary joins Guntur Kaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs