Advertisement
Google Ads BL

పుష్ప ద రూల్ లో అనసూయ గెటప్ ఇదే


అల్లు అర్జున్-సుకుమార్ పుష్ప ద రైజ్ తో  ప్యాన్ ఇండియా ప్రేక్షకులని పడగొట్టేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన పుష్ప పార్ట్ 1 అనూహ్యమైన హిట్ అయ్యింది. జస్ట్ కొద్దిపాటి ప్రమోషన్స్ కే పుష్ప ద రైజ్ ని ప్యాన్ ఇండియా ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, రష్మిక శ్రీవల్లిగా, సునీల్ మంగళం శ్రీనుగా, అనసూయ దాక్షాయణిగా ప్రేక్షకులలో తమ పాత్రలతో బలమైన ముద్ర వేశారు. అందమైన అనసూయ దాక్షాయణి పాత్రలో నోట్లో కిళ్ళీ నములుతూ, బాబ్డ్ హెయిర్, పెద్ద బొట్టుతో ఊర మాస్ గా ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

పుష్ప పార్ట్ 1 లో మంగళం శ్రీను చనిపోయినా.. పార్ట్ 2 తో అనసూయ దాక్షాయణి పాత్ర కంటిన్యూ అవుతుంది. రీసెంట్ గానే అనసూయ పుష్ప ద రూల్ షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళింది. థాయిలాండ్ ట్రిప్ ముగియగానే తాను పుష్ప షూట్ లో అడుగుపెట్టినట్లుగా విమానం ప్రమోషన్స్ లో రివీల్ చేసింది. తాజాగా తాను పుష్ప ద రూల్ లో దాక్షాయణి గెటప్ కోసం వేయించుకుంటున్న మేకప్ పిక్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. #PushpaTheRule 🔥🧿 అంటూ క్యాప్షన్ పెట్టింది. 

ఆ పిక్ తో అనసూయ కి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేస్తున్నాడు. ఆమె రెడ్ శారీ లో కనిపించి కనిపించకుండా ఉంది. అనసూయ ఫేస్ అస్సలు రివీల్ అవ్వలేదు. ఇక మిర్రర్ ముందు మేకప్ కిట్ కి సంబందించిన పవడర్స్, బ్రెష్ లు ఆ పిక్ లో దర్శనమిస్తున్నాయి. 

Anasuya shares Pushpa The Rule makeup:

Anasuya as Dakshayani getup in Pushpa The Rule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs