Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్.. అసలు విషయమిదే!


‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత అంతే స్థాయిలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సౌత్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతున్నా.. విడుదల తేదీ మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. మాములుగా అయితే.. సినిమా ప్రారంభోత్సవం రోజే.. విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. ఈ సినిమాకు కూడా అలానే ప్లాన్ చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే, మధ్యలో శంకర్‌కు ‘ఇండియన్ 2’ కూడా యాడ్ అవడంతో.. రెండు వైపులా శంకర్ పనిచేయాల్సి వచ్చింది. 

Advertisement
CJ Advs

మరోవైపు రామ్ చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ అని కొన్ని రోజులు, తన భార్య‌ ఉపాసన గర్భవతి కావడంతో.. ఆమె కోసం అని కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణ స్లో అయిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం.. ఇంకెప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు అంటూ సోషల్ మీడియాలో మూవీ యూనిట్‌పై గరం గరం అవుతున్నారు. ముఖ్యంగా శంకర్, దిల్‌రాజులను టార్గెట్ చేస్తూ.. బండబూతులు తిడుతున్నారు. అయితే అసలీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి పెద్ద కారణమే ఉంది. 

అదేంటంటే.. ఈ సినిమా ఇంకా రెండు నెలలకు పైగా షూటింగ్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం శంకర్ ఉన్న బిజీలో.. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనేది నిర్మాత దిల్ రాజు కూడా తేల్చుకోలేకపోతున్నారట. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్‌కు శంకర్ టైమ్ ఎక్కువ తీసుకుంటాడనే విషయం తెలియంది కాదు. అందుకే విడుదల తేదీ విషయంలో దిల్ రాజు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మాములుగా అయితే దిల్ రాజు ఎప్పుడెప్పుడు విడుదల తేదీ ప్రకటిద్దామా? అని యమా ఆతృతగా ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం.. ఆయనకే ఓ క్లారిటీ లేదని అంటున్నారు. అందుకే.. ఫ్యాన్స్ తిడుతున్నా కూడా.. ఆయన స్పందించలేకపోతున్నారు. ఈ విషయం ఫ్యాన్స్‌కి ఎలా తెలియజేయాలో కూడా దిల్ రాజుకు అర్థం కావడం లేదట. అది మ్యాటర్.

Exclusive Update on Ram Charan Game Changer Release Date:

This is the reason why the release date of the game changer has not been revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs