Advertisement
Google Ads BL

కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటున్నారు!


బాలీవుడ్ లో గత ఏడాది క్యూటీ అలియా భట్ రణబీర్ కపూర్ తో పెళ్లి పీటలెక్కిన రెండు నెలలకే తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చారు. అలా పేరెంట్స్ గా మారబోతున్నామని చెప్పిన ఆరు నెలలకే వీరి చేతిలో బిడ్డ ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు అలియా భట్ పెళ్లి, తల్లవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది మరో బ్యూటీ కియారా అద్వానీ కూడా తాను ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాతో తో ఏడడుగులు నడిచింది. ఫిబ్రవరిలోనే రాజస్థాన్ కోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇచ్చింది.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత హనీమూన్, షూటింగ్స్ అంటూ బిజీ అయినా కియారా అద్వానీ తల్లి కాబోతుంది అనే అనుమానాన్ని బాలీవుడ్ మీడియా వ్యక్తం చేస్తుంది. రీసెంట్ గా కియారా అద్వానీ బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్త బాగా పాపులర్ అయ్యింది. కియారా అద్వానీ తాను నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం జైపుర్ వెళ్లింది. అక్కడ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటో షూట్ లోనే ఆమె చిన్నపాటి పొట్టతో కనిపించడం ఇప్పుడు అందరిలో అనుమానాలకు తావిచ్చింది.

దానితో ఆమె ప్రెగ్నెంట్, ఈ విషయాన్ని కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు త్వరలోనే అందరితో పంచుకుంటారు, అధికారిక ప్రకటన ఇస్తారంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. మరి కియారా అద్వానీ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తార. మరి అప్పుడే ప్రెగ్నెంట్-పిల్లలు అంటుందా.. లేదంటే ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Kiara Advani Pregnant? :

Kiara Advani latest photo sparks pregnancy rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs