Advertisement
Google Ads BL

సలార్ విలన్ పృథ్వి రాజ్ కి ప్రమాదం


మలయాళ స్టార్ హీరో.. సలార్ విలన్, ప్రభాస్ తో పోటీపడబోయే పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారనే వార్త ఆయన అభిమానులని ఆందోళన పెట్టింది. మలయాళంలో ఆయన నటిస్తున్న విలయత్ బద్ద షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. నిన్న ఆయన షూటింగ్ చేస్తున్న సమాయంలోనే ప్రమాదానికి గురి కాగా.. చిత్ర బృందం ఆయన్ని కొచ్చి లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. 

Advertisement
CJ Advs

ఈ ప్రమాదంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కాలికి గాయమవడంతో వైద్యులు ఈ రోజు ఆయనకి ఓ చిన్నపాటి ఆపరేషన్ నిర్వహిస్తారని, ఈ ఆపరేషన్ పూర్తయ్యాక ఆయన వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ.. రెండుమూడు నెలలు పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే పృథి రాజ్ కి ఏమైందో ఏమో అనే కంగారులో అభిమానులు ఉండగా.. ఆయనకి కాలికి మాత్రమే దెబ్బ తగిలింది, వేరే ఇతర ప్రమాదమేమీ లేదు అని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Prithviraj Sukumaran Met With An Accident:

Prithviraj Suffers A Serious Leg Injury While Shooting For A Malayalam Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs