Advertisement
Google Ads BL

కమల్ తో వర్క్.. ఎగ్జైట్ అవుతున్న ప్రభాస్


కలలో కూడా ఊహించని కాంబినేషన్ సెట్ అయ్యింది. ఊహకి కూడా రాని కలయిక ఇప్పుడు ప్రాజెక్ట్ K తో సాధ్యమవుతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి నటించడం అనే రూమర్ కే సోషల్ మీడియా షేక్ అయితే.. అది ఇప్పుడు వాస్తవ రూపం దాలిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. కమల్ హాసన్.. ప్రభాస్ ప్రాజెక్ట్ K లో నటించడం పైనే చర్చలు జరుగుతున్నాయి. నాగ్ అశ్విన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. కలలో కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని ఇద్దరి దిగ్గజాలని ఒకే సినిమాతో కలుపుతున్నారు.

Advertisement
CJ Advs

అటు కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ K లో వర్క్ చేయడంపై ఎగ్జైట్ అవుతుంటే.. ఇప్పుడు ప్రభాస్ తన కల సాకారమవుతున్నందుకు మరింతగా పొంగిపోతున్నారు. కమల్ హాసన్ ప్రాజెక్ట్ K లోకి ఎంటర్ అవ్వబోతున్న విషయాన్ని వైజయంతి మూవీస్ వీరు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభాస్ వేసిన పోస్ట్ వైరల్ గా మారింది.  కమల్ హాసన్ గారితో నటించడమనేది.. నా గుండెల్లో ఎప్పటికీ దాచుకునే ఒక బ్యూటిఫుల్ మూమెంట్, ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్ గారితో నటించే అవకాశం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను, ఒక టైటాన్ ఆఫ్ సినిమా లాంటి నటునితో నటించడం అనేది ఒక కల నిజం అవ్వడం లాంటిదే.. ఈ కలయికతో కమల్ గారి దగ్గర చాలా నేర్చుకుంటాం అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇప్పుడు ప్రతి భాషా ప్రేక్షకుడు ఈ కాంబో గురించిన ముచ్చట్లే. కమల్ ప్రాజెక్ట్ K లో చేయడంపై ప్యాన్ ఇండియాలోని ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అమితాబ్ కూడా కమల్ ప్రాజెక్ట్ Kలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేసారు.

Prabhas is excited to work with Kamal Haasan:

Excited Prabhas makes official announcement of working with Kamal Haasan in Project K
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs