విజయ్ దేవరకొండకి రశ్మికకి మధ్యలో ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనా.. అంతకుమించి అనేదే చాలామందికి అర్ధం కానీ ప్రశ్న. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా వీరిద్దరూ సన్నిహితంగా అంటే వెకేషన్స్ కి వెళ్లడం.. ఒకరింట్లో ఒకరు స్టే చెయ్యడం, కలిసి రెస్టారెంట్స్ కి తిరగడం అన్నమాట, ఏ.. ఫ్రెండ్స్ అయితే ఇలాంటివి చేయకూడదా అనుకోవచ్చు. చెయ్యొచ్చు.. కానీ ఎప్పటికప్పుడు సైలెంట్ గా కనిపిస్తూ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకముగా హైలెట్ అవడమే ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడు కూడా రష్మిక హైదరాబాద్ లో విజయ్ ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళిన విషయం మీడియా పసిగట్టేసింది.
విజయ్ ఫ్యామిలీతో పాటుగా రష్మిక ఫ్యామిలీ కూడా ఈ లంచ్ డేట్ లో పాల్గొనడం అందరికి విచిత్రంగా అనిపిస్తుంది. ఏమైనా రెండు ఫామిలీస్ పెళ్లి ప్రపోజ్ కోసమే కలిసాయా అని గుసగుసలాడుకుంటున్నారు. ఈ లంచ్ డేట్ లో రష్మిక ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇన్స్టాలో వైరల్ గా మారింది. విజయ్ ఇంకా ఆయన ఫ్యామిలీ, రష్మిక ఆమె ఫ్యామిలీ కలిసి ఇలా లంచ్ కి వెళ్లడం వెనుక పెళ్లి మాటలేమైనా జరుగుతున్నాయేమో అనే అనుమానాలు నెటిజెన్స్ వెలిబుచ్చుతున్నారు.