ప్రాజెక్ట్ K లోకి ఎంటరవుతున్న స్టార్ కాస్ట్ చూస్తుంటే అంచనాలు హాలీవుడ్ రేంజ్ లో పుట్టుకొస్తున్నాయి. ప్రాజెక్ట్ K ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎలా అవుతుందో అందులోకి వస్తున్న నటుల్ని బట్టి అర్ధమైపోతుంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ K ని అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు లో అమితాబ్ లాంటి లెజెండరీ నటులు, దీపికా పదుకొనే లాంటి క్రేజీ హీరోయిన్, గ్లామర్ డాల్ దిశా పటానిలు నటిస్తుంటే .. ఇప్పుడు ప్రాజెక్ట్ K లోకి లోకనాయకుడు కమల్ హాసన్ ఎంటర్ అయ్యారు.
ఇప్పటివరకు కమల్ హాసన్ ప్రాజెక్ట్ Kలోకి రాబోతున్నారు, ఈ చిత్రంలో విలన్ రోల్ పోషిస్తున్నారు అంటూ ప్రచారం జరగడమే కానీ.. ఈ న్యూస్ పై ప్రకటన లేదు. కానీ ఈరోజు వైజయంతి మూవీస్ వారు కమల్ హాసన్ ప్రాజెక్ట్ K లో భాగం కాబోతున్నట్టుగా అధికారికంగా వదిలిన వీడియోతో ఈ ప్రాజెక్ట్ రూపు రేఖలు మారిపోయాయి. ప్రభాస్ తో కమల్ హాసన్ తలపెడితే.. అది ఊహించుకుంటే అభిమానులకి మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అందరికి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.
అంతేకాకుండా కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వైజయంతి మూవీస్ వారు ఓ స్పెషల్ వీడియోని వదిలారు. ఇక ప్రభాస్ తో కమల్ పని చెయ్యడం, ప్రాజెక్ట్ K లోకి కమల్ రావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.