గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. కారణం భర్త పేరుని రివీల్ చెయ్యకుండానే ప్రెగ్నెంట్ అయ్యి.. బేబీ బంప్ ఫొటోస్ ని సోషల్ మీడియాని షేక్ చేస్తూ హడావిడి చేస్తుంది. సినిమాల్లో అవకాశాలు రాక కెరీర్ లో డల్ అవడమే కాకుండా డిప్రెషన్ లోకి వెళ్లి బరువు పెరిగిన ఇలియానాని నెటిజెన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలియానా డెలివరీకి దగ్గరవుతున్న ప్రెగ్నెంట్ లేడి.. ప్రస్తుతం బేబీ బంప్ ఫొటోస్ తో పాటుగా.. తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చెయ్యడానికి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది.
తాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ అభిమాని ఇలియానా నువ్వు బరువు పెరుగుతన్నందుకు ఏమైనా ఫీలవుతున్నావా అని అడగగా.. దానికి ఇలియానా బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు బరువు పెరగడం అనేది సహజం. కానీ జనాలు పదే పదే బరువు గురించి మాట్లాడుతుంటే.. కాస్త బెంగగా ఉండేది. డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడల్లా.. బరువు చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నా బరువు తెలిసిపోయేది. కడుపులో బిడ్డ ప్రాణం పోసుకుంటున్న విషయాన్ని అందరూ గుర్తు చేసేవారు.
అప్పుడు బరువు గురించి అలోచించి ఆందోళనపడడం వృధా అనుకున్నాను, కొద్ది నెలలుగా నా శరీరంలో వస్తున్న మార్పులని స్వీకరిస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ నన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు. అలాంటప్పుడు బరువు గురించి అలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఇంత పెరిగాం, అంత పెరిగాం అని ఆందోళన వద్దు, బిడ్డని మోస్తూ ఆనందం, కన్నీళ్లు, తృప్తిని అనుభవిస్తున్నాను, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ ఎమోషల్ అయ్యింది ఇలియానా.