సూపర్ స్టార్ మహేష్ బాబు గ్యారేజ్ లో అన్నీ కాస్ట్లీ కార్లే ఉంటాయి. అందులో పెద్ద విచిత్రమేమి లేదు. ఆయన సూపర్ స్టార్.. అందుకే ఆయన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖరీదైనవే కనిపిస్తాయి. కానీ మహేష్ ఇంట్లోకి ఐదైనా కొత్త వస్తువు వస్తుంది.. అందులోనూ ఖరీదైన వస్తువు వస్తే.. అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు ఫాన్స్ కూడా మహేష్ ఇంట్లోకి వచ్చే వస్తువు గురుంచి తెలిసి ఎగ్జైట్ అవుతూ మాట్లాడుకుంటారు. తాజాగా మహేష్ గ్యారేజ్ లోకి ఓ కొత్త కారొచ్చింది.
దాని విలువ అక్షరాలా 5.4 కోట్లు. బ్రాండెడ్ రేంజ్ రోవర్ కారుని మహేష్ బాబు 5.4 కోట్లు పెట్టి కొనేసి.. తన గ్యారేజ్ లో పెట్టేసాడు. అయితే మహేష్ కొన్న కారు తెలుపో.. నలుపో కాదట.. గోల్డ్ కలర్ కారు అని తెలుస్తుంది. మరి ఇలాంటి కారు మెగాస్టార్ చిరు, మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కొంటే.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మహేష్ కూడా చేరాడు. మరి మహేష్ బంగారు రంగు రేంజ్ రోవర్ కారు రోడ్డెక్కింది అంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయేమో.