ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు చెయ్యాలని టాలీవుడ్ నుండి బాలీవుడ్ డైరెక్టర్స్ వరకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనతో ఒక్క ప్రాజెక్ట్ చేసినా చాలనేది వాళ్ళ ఆశ. ప్రభాస్ కూడా పలు భాషా దర్శకులతో చేతులు కలుపుతున్నారు. ప్రస్తుతం కూడా ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఆదిపురుష్ ఇప్పటికే విడుదల కాగా.. సలార్, ప్రాజెక్ట్K చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక మారుతి ప్రాజెక్ట్, సందీప్ వంగ ప్రాజెక్ట్, సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి.
అయితే తమిళనాట డ్రగ్స్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ సంచలన దర్శకుడిగా మారి.. LCU ని (లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్) సృష్టించిన లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ మూవీ ఉంటుంది అని ఎప్పటినుండో ప్రచారమైతే జరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ మూవీ సెట్ అయితే విషయం మాములుగా ఉండదు అని ప్రభాస్ ఫాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈప్రాజెక్టు విషయంలో ప్రభాస్ కానీ, లోకేష్ కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా లోకేష్ కనగరాజ్ ప్రభాస్ ప్రాజెక్ట్ పై ఓపెన్ అయ్యాడని తెలుస్తుంది.
ప్రభాస్ తో తాను ఎప్పుడు నుంచో టచ్ లో ఉన్నానని చెప్పి ఫాన్స్ కి భీభత్సమైన సర్ ప్రైజ్ ఇచ్చాడు. అయితే తాము ఇద్దరం ఎప్పటినుండో టచ్ లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తాము తమ తమ చిత్రాలతో కొన్నాళ్ళు బిజీగా ఉంటామని ఆ తర్వాత మాత్రం ప్రభాస్ తో తప్పకుండా సినిమా ఉంటుంది అని అయితే గ్యారెంటీ ఇచ్చాడు. దీనితో ప్రభాస్-లోకేష్ కనగరాజ్ ల కేజీ అప్డేట్ ఫ్యాన్స్ కి పిచ్చ సంతోషాన్నిచ్చింది.