రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో మొదలు కాబోయే SSMB29 పై ఏ చిన్న న్యూస్ బయటికి వచ్చినా అది నిమిషాల్లో కాదు.. క్షణాల్లో వైరల్ అవుతుంది.రాజమౌళి తండ్రిగారు విజయేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు SSMB29 పై చెప్పే కబుర్లకి మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ ఎంతో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇది ప్యాన్ ఇండియా కాదు గ్లోబల్ వైడ్ గా తెరకెక్కుతుంది అంటూ ఆయన అందరిలో ఆసక్తిని, అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. అఫీషియల్ గా మొదలు కాకముందే ఈ చిత్రంపై హాలీవుడ్ రేంజ్ అంచనాలు ఉన్నాయి.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ మరోసారి SSMB29 పై ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. SSMB29 ఇండియానా జోనస్ సిరీస్ తరహాలో ఉంటుంది. ఇది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ [1981] వంటి అనేక ఎమోషనల్స్ తో కూడిన అడ్వెంచర్-యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఈ జూలై నాటికి SSMB29 కి సంబందించిన నా స్క్రిప్ట్ పూర్తి కావాలి. స్క్రిప్ట్ పూర్తి కాగానే నా కొడుకు రాజమౌళి చేతిలో పెడతాను. SSMB29 కి సంబందించిన క్లైమాక్స్‌ను ఓపెన్-ఎండెడ్‌గా వదిలివేస్తున్నాము, ఆ తర్వాత దానికి సీక్వెల్ యొక్క అవకాశం ఉంటుందా, లేదా.. అనేది ఆలోచిస్తామంటూ ఆయన చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి జులై నాటికి రాజమౌళి-మహేష్ ల స్క్రిప్ట్ పూర్తయితే.. ఈసినిమా ఎప్పుడు మొదలు పెడతారు, మహేష్ త్రివిక్రమ్ మూవీ ఫినిష్ చేస్తారో అని మహేష్ అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందో లేదంటే హాలీవుడ్ భామ దిగుతుందో చూద్దాం.