Advertisement
Google Ads BL

భోళా శంకర్ టీజర్ రివ్యూ


మెగాస్టార్ చిరంజీవి వరస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య ఇలా వరస హిట్స్ తరువాత మెగాస్టార్ నుండి వస్తున్న మరో మాస్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 11 న విడుదలకి రెడీ చేస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన భోళా శంకర్ నుండి మెగా మాస్ మ్యానియా అంటూ ప్రమోషన్స్ లో జోరు మొదలు పెట్టారు. ఏకే ఎంటెర్టైమెంట్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భోళా శంకర్ నుండి టీజర్ వచ్చేసింది. 

Advertisement
CJ Advs

మాస్‌ ఎలివేషన్‌తో భోళా టీజర్‌ మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చేదిలా ఉంది. మొత్తం ముప్పై మూడు మందిని చంపేశాడు సార్‌ అంటూ మాస్‌ ఎలివేషన్‌తో టీజర్‌ స్టార్ట్ అయింది. చిరు మాస్‌ ఎంట్రీ, వీర లెవల్లో ఫైట్‌, కిక్కిచ్చే డ్యాన్స్‌ స్టెప్పులు, విజిల్స్‌ వేయించే డైలాగ్స్‌, మధ్యలో సిస్టర్ కీర్తి సురేష్ బ్యూటిఫుల్లు, హీరోయిన్ తమన్నా ఎంట్రీ, లవర్ బై సుశాంత్ స్టైలిష్ లుక్స్, ఇలా మొత్తంగా టీజర్‌ ఊరమాస్‌గా ఉంది. షికారు కొచ్చిన షేర్‌ను బే, ఇస్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నా వాళ్లే. ఆల్‌ ఏరియాస్‌ అప్నా హే.. 

నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు.. దేక్‌లేంగే అంటూ మెగాస్టార్‌ చెప్పిన డైలాగ్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. మరి మెగా మాస్ మ్యానియా ఎలా ఉంటుంది ఈ టీజర్ తో మేకర్స్ జస్ట్ శాంపిల్ చూపించారు అంతే.. ముందుంది అసలు సినిమా. ఆగష్టు 11 వరకు వెయిట్ చేస్తే చాలు భోళా శనకర్ ఫుల్ మూవీని వీక్షించేందుకు. 

Bholaa Shankar Teaser Review:

Chiranjeevi Bholaa Shankar Teaser Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs