Advertisement
Google Ads BL

చిరు అలా.. బాలయ్య ఇలా


సీనియర్ హీరోలైన బాలయ్య-చిరు-నాగ్-వెంకీలలో చిరు, బాలయ్యలు సినిమాల విషయంలో దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం సైలెంట్ గా డల్ గా కనబడుతున్నారు. ఇక వెంకీ కూడా సినిమాలు, సీరీస్ లతో హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం చిరు vs బాలయ్య అన్న రేంజ్ లో వీరు ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బయట కూడా వీరిద్దరూ పోటీ పడుతున్నారా అనిపించేలా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్న శుక్రవారం బాలకృష్ణ ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 23వ యాన్యువల్ డే లో పాల్గొన్నారు. హీరోయిన్ శ్రీలీల, పీవీ సింధుతో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిలో సందడి చేసారు. 

Advertisement
CJ Advs

అదే రోజు చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, స్టార్‌ ఆసుపత్రి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉచిత క్యాన్సర్‌ టెస్ట్ లు నిర్వహిస్తామని మెగాస్టార్ వెల్లడించారు. జులై 9 నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, రోజుకు 1000 మందికి ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని.. చిరంజీవి  మీడియా సమావేశంలో చెప్పారు. సినీ కార్మికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ కు చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజుకు 1000 మందికి చొప్పున అన్ని రకాల కాన్సర్ టెస్టులు చేస్తారు. సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఈ విషయంపై చర్చిస్తాం. క్యాన్సర్ స్క్రినింగ్ కోసం సినీ కార్మికులకు ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని చెప్పారు. 

ఒకేరోజు బాలకృష్ణ అలా బసవతారకం ఆసుపత్రి 23 వ యాన్యువల్ డే లో పాల్గొంటే.. మెగాస్టార్ చిరు ఇలా స్టార్ ఆసుపత్రి వైద్యులతో ఉచిత క్యాన్సర్ టెస్ట్ లు నిర్వహిస్తామని ప్రకటించడం గమ్మత్తుగా ఉంది.

Balakrishna at Basavatarakam Cancer Hospital 23rd Annual Day Celebrations :

Chiranjeevi Announce Free Cancer Screening Test
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs